/rtv/media/media_files/2025/05/18/xxJfA4BZRLvPn47hPG53.jpg)
theaters close in ap, Telangana from june 1st
Cinema: టాలీవుడ్ లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య కొనసాగుతున్న పర్సెంటేజీల వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఎగ్జిబిటర్లు సమావేశంలో.. తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు (థియేటర్ యాజమాన్యాలు) అంతా కీలక నిర్ణయానికి వచ్చారు. రెంటల్ సిస్టమ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అద్దె విధానంలో సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి తెలంగాణ, ఏపీలో థియేటర్లు మూసివేయాలని ప్రతిపాదించారు. త్వరలో
ఎగ్జిబిటర్లు అధికారికంగా బంద్ నోటీసును సమర్పించనున్నట్లు సమాచారం.
ఎఫ్ డీసీ ఛైర్మెన్ దిల్ రాజు, సురేష్ బాబు తో పాటు 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే పర్సెంటేజ్ విధానంపై పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మౌనం పాటిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రొడ్యూసర్లు పొందే ఆదాయం తగ్గే అవకాశం ఉండడంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారు.
రెంటల్ విధానం అంటే ఏమిటి..?
నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్లకు ఒక ఫిక్స్‌డ్ అద్దె (Fixed Rent) చెల్లిస్తారు. ఆ తర్వాత సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా.. పెరిగిన లాభంలో వాటా ఉండదు. ఆ ఫిక్స్డ్ అద్దె మాత్రం వారికి వస్తుంది. దీనివల్ల నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని సినిమాలు ఆడకపోతే ఎగ్జిబిటర్లు నష్టాల్లో పడుతున్నారు. అందుకే ఇప్పుడు సినిమా లాభాల్లో పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.
సినిమాలపై మొదట ప్రభావం
కమల్ హాసన్ థగ్ లైఫ్, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాలు జూన్ లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్.. ఈ చిత్రాలకు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. బంద్‌కు ఇంకా 12 రోజులు సమయం ఉన్నందున, టాప్ నిర్మాతలు, ఇండస్ట్రీలో సీనియర్ సభ్యులు స్పందిస్తే, ఈ సమస్యకు సమాధానం దొరకవచ్చు.
cinema-news | telugu-news | latest-news