Thammudu Box Office Collections: నితిన్‌కు మరో షాక్! 75 కోట్ల 'తమ్ముడు' కథ కంచికే?

నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా, కనీస స్థాయి వసూళ్లను కూడా సాధించలేకపోయింది.

New Update

Thammudu Box Office Collections:  నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా జూలై 4, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నారు.  గత కొన్ని సినిమాలతో వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ కి..  'తమ్ముడు' కమ్ సినిమా అవుతుందని భావించారు. కానీ, ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. నాలుగు రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3.21 కోట్ల నెట్ (రూ. 6.20 కోట్ల గ్రాస్) మాత్రమే వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Also Read:Phone Shaped Slab: ఇది పట్టుకుంటే ఫోన్ కి దూరమైనట్లే!.. కొత్త డిజిటల్ డీటాక్స్ టూల్

కలెక్షన్లు డ్రాప్!

ఇది నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన గత చిత్రం 'రాబిన్ హుడ్' రూ. 4.8 కోట్లు సాధించగా, 'తమ్ముడు' దాన్ని కూడా అధిగమించలేకపోయింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ. 22.5 కోట్లు రాబట్టాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది చాలా కష్టమని, ఈ సినిమా నితిన్ కెరీర్‌లో ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ద్వారా కొంత బడ్జెట్ తిరిగి వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నప్పటికీ, థియేట్రికల్ రన్‌కు మాత్రం భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. 'తమ్ముడు' నితిన్‌కు వరుసగా నాలుగో ఫ్లాప్ కావడం గమనార్హం. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్  'యెల్లమ్మ' విజయం నితిన్ కమ్ బ్యాక్ కి కీలకంగా మారనుంది. 'తమ్ముడు' సినిమా అక్కా-తమ్ముళ్ల బంధం చుట్టూ తిరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

Also Read:Hari Hara VeeraMallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు