Akhanda 2: "నా తమ్ముడి గెటప్ కాపీ కొట్టా.." 'అఖండ 2' ట్రైలర్ లాంచ్‌ లో బాలయ్య సందడి.

'అఖండ 2' ట్రైలర్‌ను బాలకృష్ణ-బోయపాటి శ్రీను కర్ణాటకలో శివరాజ్‌కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. సనాతన ధర్మం నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్, బాలయ్య డైలాగులు, భారీ విజువల్స్‌తో ట్రైలర్ పెద్ద హైప్ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది.

New Update
Akhanda 2

Akhanda 2

Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న అఖండ 2 విడుదలకు ముస్తాబైంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ భారీ యాక్షన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ట్రైలర్‌ను అద్భుతంగా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు కర్నాటక టాప్ హీరో శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా వచ్చి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Akhanda 2 Trailer

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, శివరాజ్‌కుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. “ఈ సినిమా శివ తత్వాన్ని చూపించే చిత్రంగా తెరకెక్కింది. అలాంటి ట్రైలర్‌ను శివన్న చేతుల మీదుగా విడుదల చేయడం మా అదృష్టం” అని చెప్పారు. వర్షం పడుతున్నప్పటికీ అభిమానులను కలవాల్సిందేనని బాలయ్య, శివన్న ఇద్దరూ నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు.

బోయపాటి కథపై చిన్న క్లూ కూడా ఇచ్చారు. “మన దేశాన్ని కించపరచే వాళ్లు ఎవరైనా ఉంటే, ధర్మమే ఆయుధంలా ఎదురు నిలుస్తుంది. ఇదే ఈ సినిమా భావం” అని తెలిపారు.

శివరాజ్‌కుమార్ కూడా బాలయ్య కుటుంబంతో తమ కుటుంబ బంధాన్ని గుర్తు చేశారు. “మేము ఒక కుటుంబం లాంటివాళ్లం. ఫైట్స్, డ్యాన్స్, ఇందులో చూసినా బాలయ్య ఒక అడుగు ముందే ఉంటారు. డిసెంబర్ 5న అఖండ 2తో మళ్ళీ సంబరానికి సిద్ధం అవ్వండి” అని చెప్పారు.

బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రకృతి కూడా ఆశీర్వదించినట్లుగా అనిపించిందన్నారు. “అఖండ 2 కేవలం తెలుగు-కన్నడ సినిమా కాదు… ఇది పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో సనాతన ధర్మం మూలాలు కనిపిస్తాయి. నా సినిమాలు యువతకు మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉంటాయి. ఈ సినిమాలో కూడా ధర్మం ఎలా నిలబడాలో చూపిస్తాం” అని చెప్పారు. అలాగే వీర సింహా రెడ్డి సినిమాలో తన లుక్‌ను శివన్న ముఫ్టీ సినిమాలోని గెటప్ నుంచి ప్రేరణగా తీసుకున్నానని చెప్పడం ప్రత్యేకంగా మారింది.

నా తమ్ముడు శివరాజ్‌కుమార్‌ గెటప్ కాపీ కొట్టా: బాలకృష్ణ

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో విడుదలైన ట్రైలర్ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. “ఇప్పటివరకు మా దేశ రూపం మాత్రమే చూసావ్… మా దేశ విశ్వరూపం చూడలేదు” అనే బాలయ్య డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ట్రైలర్‌లో యాక్షన్ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బాలయ్య గంభీరమైన నటన- ఇవన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

మొత్తానికి, అఖండ 2 ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. బాలయ్య-బోయపాటి కాంబో మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించేందుకు రెడీగా ఉన్నట్లే కనిపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు