/rtv/media/media_files/2025/11/21/vetrimaaran-2025-11-21-21-22-47.jpg)
Vetrimaaran
Vetrimaaran: తమిళ దర్శకుడు వెట్రిమారన్ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో భారీ హంగామా చేస్తోంది. రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు, చిన్న వీడియో, మీమ్స్ వరుసగా కనిపిస్తున్నాయి. ఏ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా వెట్రిమారన్ ముఖమే ముందుగా కనిపించటంతో ఇప్పుడు నెటిజన్ల దృష్ఠంతా ఆయన మీద పడింది.
ఇదంతా ఎందుకు మొదలైంది అంటే, ఇటీవల జరిగిన ‘మాస్క్’ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌లో తీసిన చిన్న వీడియో. స్టేజ్ మీద ఎవరి మాట్లాడుతున్న సమయంలో వెట్రిమారన్ చేసిన ముఖ కవళికలు, చేతి సైగలు మీమర్స్‌కు నచ్చేశాయి. ఆ కొన్ని సెకన్ల క్లిప్‌ను మీమ్స్ కోసం పర్ఫెక్ట్ టెంప్లేట్‌గా మార్చేశారు.
Every Indian Mom pic.twitter.com/LnMhkoLQM8
— Nand@n (@nandantwts) November 20, 2025
దాంతో సోషల్ మీడియాలో “వెట్రిమారన్ రియాక్షన్”, “టెంప్లేట్ ఆఫ్ ది మంత్”, “వెట్రిమారన్ సర్ టెంప్లేట్” లాంటి క్యాప్షన్లతో మీమ్స్ వరుసగా షేర్ అవుతున్నాయి.
రాజకీయాల నుంచి సినిమా వరకు, జిమ్ ఫన్నీ కాంటెంట్ నుంచి ఫ్యామిలీ జోక్స్ వరకు ఏ టాపిక్‌కైనా ఇదే వీడియోను పెట్టి మీమ్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో వెట్రిమారన్ పక్కన మ్యూజిక్ డైరెక్టర్- నటుడు జీవీ ప్రకాశ్, మరో పక్కన విజయ్ సేతుపతి కనిపించడం కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.
ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
“ఎప్పుడూ సీరియస్‌గా ఉండే వెట్రిమారన్ కూడా మీమ్ మేటీరియల్ అవుతారని ఊహించలేదు” “ప్రతి నెల ఒక ‘మీమ్ మామ’ వస్తాడు… ఈసారి వెట్రిమారన్ టర్న్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ క్లిప్ అసలు వీడియో ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తితో చాలా మంది వెతుకుతుండగా, కొందరు ఆ అసలు వీడియోని కూడా షేర్ చేశారు. ఇలా, ఒక్క చిన్న రియాక్షన్ క్లిప్‌తో వెట్రిమారన్ ఇప్పుడు సోషల్ మీడియా మోస్ట్ ట్రెండింగ్ వ్యక్తిగా మారిపోయారు.
Follow Us