/rtv/media/media_files/2025/09/28/thaman-raja-saab-2025-09-28-17-11-54.jpg)
Thaman Raja Saab
Thaman Raja Saab: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన కంపోజ్ చేసే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చార్ట్‌బస్టర్ హిట్లవుతూనే ఉన్నాయి. తాజాగా విడుదలైన "OG" సినిమాకు కూడా ఆయన మ్యూజిక్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పటికే ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న "The Raja Saab" సినిమాలో తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రభాస్-తమన్ కాంబినేషన్ మొదటిసారి పనిచేస్తోంది. అయితే తమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
"#TheRajaSaab trailer vachaka chala lekkalu maruthai. #Prabhas gari career lo one of the best cinema avutundi. Ayana chala scenes asala chala hilarious ga chesaru..
— s5news (@s5newsoffical) September 27, 2025
Maruti.. mamul cinema tiyaledu. Before Raja Saab and After Raja Saab antaru."
- #Thamanpic.twitter.com/Xtnpvx7QOH
తమన్ మాట్లాడుతూ,
2012లో విడుదలైన "Rebel" సినిమాకు మొదట తాను సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడట. కానీ తర్వాత ఆ సినిమా దర్శకుడు రాఘవ లారెన్స్ స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేయాలని డిసైడ్ అవ్వడంతో, తమన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అంటే అప్పటికే ప్రభాస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నా, అది వదిలేయాల్సి వచ్చింది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఆ తరువాత థమన్ "సాహో" బర్త్‌డే టీజర్ మ్యూజిక్, "రాధే శ్యామ్" బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే చేశారు. కానీ పూర్తిగా ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం "The Raja Saab" ద్వారా తొలిసారి వస్తున్నారు.
ఈ సినిమాకు నాలుగు పాటలు ఉన్నాయని తమన్ తెలిపారు. పాటలపై చాలా నమ్మకం ఉన్నట్టు చెప్పిన ఆయన, సినిమా మ్యూజిక్‌కి మంచి హైప్ క్రియేట్ అవుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్‌ను కూడా 2026, జనవరి 9 ఫిక్స్ చేశారు.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
మొత్తానికి, 12 ఏళ్ల తర్వాత తమన్‌కు ప్రభాస్ సినిమా చేసేందుకు వచ్చిన ఈ ఛాన్స్ ఎంతో ప్రత్యేకంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ నుంచి పెద్ద హిట్ ఆశిస్తున్నారు.