/rtv/media/media_files/2025/09/16/bathukamma-film-challenge-2025-09-16-17-35-20.jpg)
Bathukamma Film Challenge
Bathukamma Film Challenge: యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ దిల్ రాజు (Telangana Film Development Corporation) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని.. "బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్" పేరుతో ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహస్తుంది. ఇందులో షార్ట్ ఫిల్మ్స్, పాటల పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, వంటి అంశాలను తీసుకొని యువత తమ సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు.
పోటీల థీమ్స్
పోటీలో పాల్గొనేవారు ఈ కింది అంశాలపై షార్ట్ ఫిల్మ్స్ లేదా పాటలను రూపొందించవచ్చు
ప్రజా పాలన పథకాలు: మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు.
యువతకు అవకాశాలు: యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి కార్యక్రమాలు.
తెలంగాణ సంస్కృతి: రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు.
Under the aegis of Telangana Film Development Corporation…
— Jacob Ross (@JacobBhoompag) September 16, 2025
Bathukamma Young Filmmakers’ Challenge…
Competitions on the themes of People’s Governance, Telangana Festivals, History, and Culture
An open invitation to young creative minds to participate in the contest.
To… pic.twitter.com/DYb2gB7gJZ
Also Read : 'టూ మచ్'! సల్మాన్, అమీర్, ఆలియా... అందరూ ఒకే వేదికపై! ప్రోమో అదుర్స్!
ఈ పోటీకి సంబంధించిన నిబంధనలు, వివరాలు
వయస్సు: పోటీలో పాల్గొనే యువత వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి.
నిడివి: షార్ట్ ఫిల్మ్స్ గరిష్టంగా 3 నిమిషాలు, పాటలు గరిష్టంగా 5 నిమిషాల నిడివితో ఉండాలి.
నాణ్యత: వీడియోలు 4K రిజల్యూషన్‌లో చిత్రీకరించాలి.
నిజాయితీ: ఈ పోటీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను మాత్రమే పంపాలి. గతంలో ఎక్కడా ప్రదర్శించిన వీడియోలు అంగీకరించబడవు.
బహుమతులు & తుది గడువు
పోటీలలో గెలుపొందినవారికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భారీగా బహుమతులను ప్రకటించింది.
ప్రథమ బహుమతి: రూ. 3 లక్షలు
ద్వితీయ బహుమతి: రూ. 2 లక్షలు
తృతీయ బహుమతి: రూ. 1 లక్ష
కన్సొలేషన్ బహుమతి: ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 20 వేలు
Also Read : ఫుల్ ఫైర్ మీదున్న సుమన్ శెట్టి.. ఈరోజు హౌజ్ లో రచ్చ రచ్చే! ప్రోమో చూశారా