Bigg Boss Promo: సినిమాలో హీరో ఎంట్రీ కోసం ఎదురుచూసినట్లు.. బిగ్ బాస్ హౌజ్ లో సుమన్ శెట్టి ఎప్పుడు మాట్లాడతాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. మొదటి వారమంతా హౌజ్ లో ఉన్నాడా? లేదా అన్నట్లుగా మౌనరథం పాటించిన సుమన్ శెట్టి.. మొత్తానికి రెండవ వారంతో తన ఆట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన నామినేషన్ ఎపిసోడ్ ప్రోమోలో ఫుల్ ఫైర్ మీద కనిపించాడు. నామినేషన్ ప్రక్రియలో హౌజ్ మేట్స్ ని ఆటాడకున్నారు. తనను నామినేట్ చేసిన సంజన, ప్రియకు గట్టిగా కౌంటర్లు విసిరారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా, సాఫ్ట్ గా కనిపించిన సుమన్.. ఒక్కసారిగా రెచ్చిపోవడంతో హౌజ్ మేట్స్ అంతా షాకయ్యారు. ప్రోమో చూసిన ఆడియన్స్ కూడా.. ఇది కదా మాకు కావాల్సింది! సుమన్ శెట్టి రాక్స్.. హౌజ్ మేట్స్ షాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నోరు విప్పాడయ్యా అని అనుకుంటున్నారు. ప్రోమో చూస్తుంటే.. ఇక నుంచి సుమన్ శెట్టి ఆటలో చెలరేగిపోనున్నట్లు తెలుస్తోంది.
ఇమ్యాన్యుయేల్ వర్సెస్ మాస్క్ మ్యాన్
మరోవైపు నామినేషన్ ప్రక్రియలో ఇమ్మాన్యుయేల్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ మధ్య పెద్ద గొడవ జరిగింది. గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ కామెంట్స్ గురించి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవలో మాస్క్ మ్యాన్ ఇమ్మాన్యుయేల్ పై రెచ్చిపోయాడు. మీద మీదకు వచ్చేసి గట్టి గట్టిగా అరిచేశాడు. దీంతో హౌజ్ మేట్స్ అంతా షాకయ్యారు. ''నేను గగుండు అంకుల్ అనడం తప్పైతే.. మీరు నన్ను రెడ్ ఫ్లవర్ అనడం కూడా తప్పే అని'' వాదించాడు ఇమ్మాన్యుయేల్. మాస్ మ్యాన్ మాత్రం అందులో తన తప్పేమి లేదు అన్నట్లుగా వాదించాడు. అయితే దీని గురించి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వీడియో చూపించినప్పటికీ ఇంకా తప్పును ఒప్పుకోకుండా వాదిస్తూనే ఉన్నాడు మాస్క్ మ్యాన్.
#Thanuja Nominated #HarithaHarish
— BigBoss Telugu Views (@BBTeluguViews) September 15, 2025
One of the best arguments from both sides!!#BiggBossTelugu9pic.twitter.com/CMCEBr2LrE
భరణి, డాక్టర్ ప్రియ మధ్య కూడా గట్టిగానే గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. కుకింగ్ విషయంపై వీరిద్దరి నామినేషన్ కొనసాగింది. మీరు వండిన అన్నం అసలు ఉడకలేదు అంటూ భరణి పై రెచ్చిపోయింది ప్రియ. అతడు చెప్పే పాయింట్ ఏంటి కూడా వినకుండా అరుస్తూనే ఉంది. ఆ తర్వాత తనూజ, డెమోన్ పవన్ కి కూడా వాగ్వాదం జరిగింది.
Also Read: Ram Gopal Varma: మరో వివాదంలో చిక్కుకున్న RGV.. పోలీస్ కేసు పెట్టిన ఐపీఎస్ అధికారిణి !