Talk Show: 'టూ మచ్'! సల్మాన్, అమీర్, ఆలియా... అందరూ ఒకే వేదికపై! ప్రోమో అదుర్స్!

బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ కుమార్ భార్యలు కాజోల్,  ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా మారారు. ఒక కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' అనే టాక్ సెలబ్రెటీ టాక్ షోతో రాబోతున్నారు

New Update

Talk Show: ఈ మధ్య ఇండస్ట్రీలో సెలబ్రెటీ టాక్ షోల ట్రెండ్ బాగా నడుస్తోంది. అయితే ఈ షోలకు సెలబ్రెటీల హోస్టులుగా వ్యవహరించడం ఆడియన్స్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో వచ్చిన పలు సెలబ్రెటీ టాక్ షోలు సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ లో ఇదువరకు  'కాఫీ విత్ కరణ్' టాక్ షో ఫుల్ సక్సెస్ అవ్వగా.. ఇప్పుడు మరో కొత్త షో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ షోకు బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ కుమార్ భార్యలు కాజోల్,  ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా మారారు. 

'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' అనే సెలబ్రెటీ టాక్ షోతో రాబోతున్నారు. సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది ప్రసారం కానుంది.  ఈ మేరకు తాజాగా టాక్ షో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఎంతో ఆహ్లాదకరంగా, ఎంటర్ టైనింగ్ కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా ఈ టాక్ షోలో సందడి చేశారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆలియా భట్, వరుణ్ ధావన్, గోవింద, కృతి సనన్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ వంటి స్టార్స్ గెస్టులుగా పాల్గొన్నారు. షోలో  సల్మాన్ , అమీర్ ఖాన్ జంటగా  సందడి చేయడం అందరినీ దృష్టిని ఆకర్షించింది. 

ట్రైలర్ లో సెలబ్రెటీ గెస్టులతో కాజల్, ట్వింకిల్  సరదా సంభాషణలు నవ్వులు పూయించాయి.  ఎంటర్ టైన్మెంట్ తో పాటు సెలబ్రెటీల సినిమా కెరీర్,  వారి వ్యక్తిగత జీవితాలు, వృత్తిపరమైన విషయాల గురించి ఈ టాక్ షోలో చర్చించడం కనిపించింది. హోస్ట్  ట్వింకిల్ తనదైన స్టైల్లో  కొన్ని బోల్డ్ ప్రశ్నలు అడగడం.. దానికి సెలబ్రెటీలు ఆశ్చర్యపోవడం  ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.  ఓ సన్నివేశంలో విక్కీ కౌశల్ "మీరిద్దరూ మమ్మల్ని ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నారు" అని చెప్పడం  సరదాగా  అనిపించింది. ఇది ఒక రెగ్యులర్ టాక్ షోలా కాకుండా స్నేహితులతో కలిసి చిల్ అవుతున్నట్లుగా ఉంటుందని  కాజల్, ట్వింకిల్ తెలిపారు. అలాగే ఇక్కడ స్క్రిప్టెడ్, రిహార్సల్ చేసిన సమాధానాలు అన్నారు. అంతా జెన్యూన్ ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి అన్నట్లుగా చెప్పారు. 

షారుఖ్ ఎక్కడ.. 

అయితే ఈ టాక్ షో ట్రైలర్ బాలీవుడ్ కింగ్ షారుక్ కనిపించకపోవడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. దీని గురించి షో నిర్వాహకులను ప్రశ్నించగా.. హోస్ట్ ట్వింకిల్‌ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.  ''షారుక్ ని  మేం కొన్ని ప్రశ్నలు అడిగాం, కానీ ఆయన ఒక్కదానికీ సమాధానం చెప్పలేదు". దీంతో ఆయన డేట్స్ లభించవని మాకు అర్థమైంది. అందుకే ఆయన కటౌట్ తీసుకొచ్చాం అని సరదాగా బదులిచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ప్రతీ గురువారం ఒక కొత్త సెలబ్రెటీ గెస్టుతో అలరించనున్నారు. 

Also Read: Bigg Boss Promo: ఫుల్ ఫైర్ మీదున్న సుమన్ శెట్టి.. ఈరోజు హౌజ్ లో రచ్చ రచ్చే! ప్రోమో చూశారా

Advertisment
తాజా కథనాలు