BIG BREAKING :  నటి కృష్ణవేణి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని  ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు.

New Update
krishna veni

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.  ప్రస్తుతం కృష్ణవేణి వయసు 102 సంవత్సరాలు.  గత కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ ఈ రోజున తుదిశ్వాస విడిచారు.  కాగా మనదేశం సినిమాతో సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు.  

అనసూయ చిత్రంతో బాలనటిగా ఎంట్రీ

1936 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించిన కృష్ణవేణి... సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు నాటక కళాకారిణి. కృష్ణవేణి తొలి చిత్రం అనసూయ (1936)లో బాలనటిగా నటించింది.  కృష్ణవేణి తండ్రి కృష్ణారావు వైద్యుడు. తెలుగు చిత్రాలలో నటించడానికి ఆమెకు అనేక ఆఫర్లు రావడంతో 1939లో చెన్నైకి మకాం మార్చారు. 1939లో మీర్జాపురం జమీందార్‌ను వివాహం చేసుకున్నారు కృష్ణవేణి. వీరికి అప్పట్లో శోభనాచల స్టూడియో అనే నిర్మాణ సంస్థ ఉంది. దీన్ని అనంతరం వీనస్ స్టూడియోగా మార్చారు. కృష్ణవేణి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. 

నటిగానే కాకుండా నిర్మాతగా

కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా మాత్రమే కాకుండా నేపథ్య గాయనిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవేణి. మనదేశం సినిమాలో ఎన్టీఆర్‌తో పాటుగా యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు కృష్ణవేణి .ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు.  1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది ఈమెనే. చివరగా కృష్ణవేణి 1951లో పెరంటాలు అనే సినిమాలో నటించారు.  తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. కృష్ణవేణి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవేణి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరగనున్నాయి.  

Also Read :   ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు