Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమేషన్ కి రంగం సిద్ధమైంది. నిన్న శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. అయితే ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టి, మనీష్ మర్యాద, ఫ్లోరా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం తక్కువ ఓటింగ్ తో తప్పించుకున్న ఫ్లోరాకు.. ఈ వారం కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ ముగ్గురిలో ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారు ప్రేక్షకులు.
షాకింగ్ ఎలిమినేషన్
కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఊహించని విధంగా ప్రియా శెట్టి లేదా మనీష్ మర్యాద హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం మనీష్, ప్రియా ఆట తీరే వాళ్ళను డేంజర్ జోన్లో పడేసినట్లు ప్రేక్షకుల అభిప్రాయం. నామినేషన్ ప్రక్రియలో మనీష్ డబుల్ స్టాండ్స్, ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రాటజీస్ వేయడమే అతడి కొంప ముంచినట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియకు ముందు కామనర్స్ వరస్ట్ అంటూ రెచ్చిపోయాడు. ముఖ్యంగా ప్రియా, శ్రీజ పై కోపంతో ఊగిపోయాయడు. తీరా నామినేషన్ వచ్చేసరికి వారిలో నుంచి ఒక్కరిని కూడా నామినేట్ చేయకుండా.. ఎప్పుడో అయిపోయిన పాత గుడ్డు రీజన్ తో భరణిని నామినేట్ చేశాడు. ఇలా డబుల్ స్టాండ్స్ ప్లే చేయడం మనీష్ కి ప్రేక్షకుల్లో కాస్త నెగిటివిటీ తీసుకొచ్చిందని జనాల అభిప్రాయం. ఇక ప్రియా విషయానికి వస్తే.. ఫస్ట్ వీక్ నుంచి కూడా ప్రియ గట్టిగా అరవడం తప్పా తన పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్లు ప్రేక్షకులకు అనిపించలేదు. అలాగే ఈ వీక్ 'రంగు పడుద్ది' కెప్టెన్సీ టాస్క్ లో కూడా భరణి అవుట్ అవ్వగానే.. ప్రియా, శ్రీజ బిహేవియర్ ఆడియన్స్ లో ఒక నెగెటివ్ సెన్స్ క్రియేట్ చేసింది. దీంతో వీరి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గినట్లు తెలుస్తోంది. కావున వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఎక్కువగా ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
సీక్రెట్ రూమ్
అయితే ఈ వారం మరో ట్విస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని టాక్. డబుల్ ఎలిమినేషన్ జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే ప్రియా, మనీష్ ఇద్దరినీ ఎలిమినేట్ చేసి.. వీరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్స్ కూడా ఉందని నెట్టింట టాక్. మొత్తానికి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన ఫ్లోరాను.. మనీష్, ప్రియా తమ అతి, ఓవర్ కాన్ఫిడెన్స్ తో దగ్గరుండి సేవ్ చేశారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: OG: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే .. ' ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు చూస్తే షాక్!