/rtv/media/media_files/n4fv6zYD9OIB3BcFqpqj.jpg)
hanuman making video
HanuMan Making Video : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'హనుమాన్'. గతేడాది విడుదలైన ఈ చిత్రం వద్ద సంచలనం సృష్టించింది. 25 రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది. అంతే కాదు చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 డేస్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చిత్రంగా అరుదైన ఫీట్ సాధించింది. తొలి సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
హనుమాన్ మేకింగ్ వీడియో
ఇది ఇలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'హనుమాన్' కోసం ప్రశాంత్ వర్మ పడిన కష్టం, తేజ సజ్జా చేసిన విన్యాసాలు హైలైట్ గా కనిపించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హనుమాన్ సీక్వెల్
ఇక బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? అనే కాన్సెప్ట్ తో ఈ సీక్వెల్ రూపొందుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. అయితే ఈ సీక్వెల్ లో రాముడి పాత్ర ఎవరు చేయబోతున్నారు అనే దాని పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. చిరంజీవి, మహేష్ బాబు, రానా దగ్గుబాటి ఇలా పలువురి స్టార్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
Made with a lot of blood and sweat ❤️🔥
— Teja Sajja (@tejasajja123) September 11, 2024
The incredible effort from our entire team made this an epic adventure and success too!🙏
Take a peek into the mystical #MakingofHanuMan
— https://t.co/1EiGBfBriD
A @PrasanthVarma film
@Niran_Reddy @Actor_Amritha @varusarath5… https://t.co/HnbjIdgsuX
Also Read : పార్టీని గాడిలో పెడుతా.. RTVతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!