'కంగువా' ఎఫెక్ట్, వాళ్లకు థియేటర్స్ దగ్గర నో ఎంట్రీ.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం

యూట్యూబ్‌ ఛానల్స్‌, నెటిజన్ల రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. దానిని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఎక్స్‌ లో ఓ పోస్ట్‌ పెట్టింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
kang

పలు యూట్యూబ్ ఛానెల్స్ తో పాటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఈ రివ్యూల వల్ల భారీ నష్టాలు చవి చూశాయి. దీన్ని టాలీవుడ్ కన్నా ముందే గ్రహించిన తమిళ ఇండస్ట్రీ.. దాన్ని నియంత్రించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

" ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ‘ఇండియన్‌ 2’, ‘వేట్టయన్‌’, ‘కంగువా’ ఫలితాలపై పబ్లిక్‌ టాక్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇచ్చే విశ్లేషణలు ఎంతో ఎఫెక్ట్‌ చూపింది. రానురాను చిత్ర పరిశ్రమకు ఇదొక సమస్యగా మారుతోంది.

ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

ఇక నుంచి వాళ్లకు నో ఎంట్రీ..

దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి. పరిశ్రమ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్‌ యజమానులు యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో సమయంలో థియేటర్‌ వద్ద పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. 

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

అలాగే, రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటివాటికి పాల్పడితే అంగీకరించేది లేదు.." అని పేర్కొంది. కాగా కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’ విడుదలైన నాటినుంచే నెగిటివ్‌ రివ్యూలపై తమిళనాట చర్చ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన వేట్టయన్‌, కంగువా సినిమాలకు ఇదే పరిస్థితి రావడం గమనార్హం.

Also Read: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు