యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన 'విక్రమ్' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతో థ్రిల్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ సినిమాను అలా లేపింది. మూవీ చివరి ఐదు నిమిషాల్లో సూర్య ప్లే చేసిన రోలెక్స్ పాత్ర సినిమాకే హైలెట్ అయ్యింది.
కోలీవుడ్ స్టార్ సూర్య ఇందులో రోలెక్స్ అనే విలన్ పాత్రలో కనిపించాడు . ఈ పాత్ర తెరపై కనిపించింది రెండు నిమిషాలే అయినా.. అది జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆ క్యారెక్టర్‌ని పెట్టుకుని సెపరేట్ సినిమా చేయాలనే డిమాండ్ ఆడియన్స్ నుంచి వచ్చింది. ఇదే విషయంపై హీరో సూర్య 'కంగువ' ప్రమోషన్స్ లో మాట్లాడారు.
Also Read : 'రాజా సాబ్' సర్పైజ్ వచ్చేసింది.. ప్రభాస్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు
'కంగువ' ప్రమోషన్లలో పాల్గొన్న సూర్యకు ఓ ఇంటర్వ్యూలో రోలెక్స్ పాత్ర గురించిన ప్రశ్న ఎదురైంది. 'రోలెక్స్' భవిష్యత్తు ఎలా ఉంటుంది? రోలెక్స్‌ను మళ్లీ తెరపై చూడగలమా ? యాంకర్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సూర్య. . ‘రోలెక్స్ పాత్ర కోసం ఒక హాఫ్ డే మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాను.
రెండుసార్లు సమావేశమయ్యాం..
అయితే హాఫ్ డే కష్టపడితే అభిమానుల నుంచి ఇంత ప్రేమ, మద్దతు లభిస్తుందని ఊహించలేదు. 'రోలెక్స్' పాత్రను బేస్ చేసుకుని ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టాండ్ ఎలోన్ సినిమా గురించి నాతో చర్చించారు. ఈ విషయంపై రెండుసార్లు సమావేశమయ్యాం. కానీ ఏదీ ఖరారు కాలేదు.." అంటూ చెప్పుకొచ్చారు. దింతో సూర్య కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్