తిరుమల లడ్డూ వివాదంపై కోలీవుడ్ హీరో కార్తీ నిన్న 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ గురించి ఫన్ కామెంట్స్ చేయడం సరికాదు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ కామెడీ చేశారు. అలా అనడం కరెక్ట్ కాదు. కార్తీ చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి.
మరో సారి అలా అనొద్దు.. నటుడిగా కార్తీ అంటే నాకు చాలా గౌరవం.. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్స్ సరికాదు అని సూచించారు. దీనిపై కార్తీ స్పందిస్తూ.. పవన్ కు క్షమాపణలు చెప్పారు. తనకు పవన్‌కల్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందని అన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరారు. తానూ వేంకటేశ్వరస్వామి భక్తుడినేనని అన్నారు. తానెప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
అయితే కార్తీ పోస్ట్ పెట్టిన కాసేపటికే మరో ట్వీట్ వైరల్ అయింది. అది కార్తీ సోదరుడు హీరో సూర్య పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చినట్లుగా ఉంది. తన సోదరుడు చేసిన తప్పునకు తాను కూడా క్షమాపణలు చెబుతున్నానని.. పవన్ కు మద్దతుగా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని ఆ ట్వీట్ లో ఉంది.దాంతో అదికాస్తా క్షణాల్లో వైరల్ అయింది.
అది నిజం కాదు..
ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ట్వీట్ అసలు సూర్య అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది కాదు. ట్వీట్ చేసిన అకౌంట్ కు బ్లూటిక్ వెరిఫికేషన్ లేదు. సూర్య అకౌంట్‌కు ఉంటుంది. సూర్య అఫీషియల్ అకౌంట్ @Suriya_offl పేరుతో ఉంది. కానీ ట్వీట్ చేసిన అకౌంట్ మాత్రం @Suriya_offt ఐడీతో ఉంది. అంటే.. చివరి అక్షరం ఎల్ బదులుగా టి అని గుర్తించకుండా ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి.. ఈ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా రీచ్ కోసమే కొందరు ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నెటిజన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
Also Read : శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ నియామకం.. సిట్ చీఫ్‌గా పవర్ ఫుల్ ఆఫీసర్!