/rtv/media/media_files/2025/10/09/suriya-46-2025-10-09-09-43-47.jpg)
Suriya 46
Suriya 46: ప్రముఖ హీరో, జాతీయ అవార్డు విజేత సూర్య తన 46వ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పేరు ‘సూర్య46’గా అనౌన్స్ చేసారు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ బెలారస్ అనే ఈస్ట్ యూరప్ దేశంలో జరుగుతోంది. అక్కడ అందమైన లొకేషన్స్‌లో ఒక యాక్షన్ సీన్‌తో పాటు, ఒక పాటను కూడా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. సూర్యపై తీస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని స్పెషల్‌గా ప్లాన్ చేశారు.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
The shooting of #Suriya46 is currently taking place in Belarus, Europe.🎬🔥#Suriya x #VenkyAtluri#SriBalajiVideopic.twitter.com/rGWP7zC12b
— Sri Balaji Video (@sribalajivideos) October 7, 2025
ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ యువ నటి మమితా బైజు లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఆమెకు ఈ సినిమా తమిళంతో పాటు టాలీవుడ్‌లో కూడా మంచి బ్రేక్ కానుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటీమణులు రవీనా టండన్, రాధికా శరత్ కుమార్, యువ నటి భవాని శ్రీ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవి ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే చాలా హిట్ ఆల్బమ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా మంచి సంగీతం అందించనున్నారు.
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
మొత్తానికి, సూర్య46 సినిమా బిజీ బిజీగా షూటింగ్ జరుగుకుంటోంది. కథ, నటీనటులు, లొకేషన్లు అన్నీ చూస్తే… ఇది టాలీవుడ్‌లో సూర్యకి మంచి డెబ్యూ అవుతుంది అనే ఆశలు క్రియేట్ అవుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేసే అవకాశముంది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, భారీ తారాగణంతో వస్తున్న ‘సూర్య46’ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
Follow Us