Suresh Raina: హీరోగా 'చిన్న తలా' ఎంట్రీ.. సురేష్ రైనా గ్లింప్స్ వీడియో అదిరింది!

క్రికెట్ మైదానంలో సిక్సులు, ఫోర్లతో అలరించిన రైనా, ఇప్పుడు సినిమా హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. తమిళ సినిమాతో ఆయన తెరంగేట్రం చేయబోతున్నారు.

New Update
suresh raina debut into films

suresh raina debut into films

Suresh Raina:  క్రికెట్ మైదానంలో సిక్సులు, ఫోర్లతో అలరించిన రైనా, ఇప్పుడు సినిమా హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. తమిళ సినిమాతో ఆయన తెరంగేట్రం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.   వెల్కమింగ్  'చిన్న తలా' ఆన్ బోర్డు అంటూ సురేష్ రైనా ఇంట్రో వీడియో విడుదల చేశారు మేకర్స్.  'డ్రీమ్ నైట్ స్టోరీస్' అనే కొత్త సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ప్రస్తుతం 'ప్రొడక్షన్ నెం. 1' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. 'మాన్ కరాటే', 'రెమో', 'గెతు' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్  లోగన్ ఈ సినిమాకు  దర్శకత్వం వహిస్తున్నారు. 

'చిన్న తలాగా' పేరు  

అయితే  సురేష్ రైనాకు చెన్నైతో చాలా ప్రత్యేక బంధం ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడిన రైనా.. తన అద్భుతమైన ఆటతో   అభిమానుల మనసుల్లో  'చిన్న తల'గా  నిలిచిపోయాడు. తమిళనాడులో రైనాకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకే రైనా తమిళ  సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టడం  ఫ్యాన్స్ కి  సంతోషం కలిగించింది.  

గ్రాండ్ లాంచ్ ఈవెంట్ 

ఆదివారం సినీ ప్రముఖుల సమక్షంలో మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివమ్ దూబే జ్యోతిని వెలిగించే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. సురేష్ రైనా పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.  అలాగే  దర్శకుడికి, నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు. రైనాకు ఉన్న క్రేజ్, అతనికున్న అభిమానుల సంఖ్య కారణంగా  సినిమాపై అంచనాలు  భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు క్రికెట్ పిచ్‌పై బ్యాట్‌తో మాయ చేసిన రైనా, ఇప్పుడు వెండితెరపై ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisment
తాజా కథనాలు