Thug Life : థగ్‌ లైఫ్‌ బ్యాన్‌.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

కన్నడ భాషపై కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ ను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు విచారణ జరిపింది,  అనధికారిక బ్యాన్‌పై స్పందన తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.  

New Update
thug-life supreme court

thug-life supreme court

కన్నడ భాషపై కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ ను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు విచారణ జరిపింది,  అనధికారిక బ్యాన్‌పై స్పందన తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.  సినిమా పూర్తిగా సెన్సార్ అప్రూవల్ పొందినప్పటికీ, కేవలం వ్యాఖ్యల ఆధారంగా చిత్రాన్ని నిషేధించడం అభివ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధం అని పిటిషనర్ వాదించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి అనుమతి పొందినప్పటికీ, కర్ణాటకలో బెదిరింపులు, పోలీసుల జోక్యంతో థియేటర్లలో సినిమా విడుదల కాలేకపోతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జూన్ 17కి వాయిదా

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారం (జూన్ 17)కి వాయిదా వేసింది. మరి దీనిపై కర్ణాటక ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో జూన్ 5న ఇతర రాష్ట్రాల్లో విడుదలైంది. కానీ కమల్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో   కర్ణాటకలో సినిమా విడుదలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. కమల్ హాసన్ కెరీర్‌లోనే థగ్ లైఫ్ అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో కమల్ హాసన్, శింబు, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. కమల్, మణిరత్నం సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. 

Advertisment
తాజా కథనాలు