/rtv/media/media_files/Dq363VwRXgVlb8C3CvMF.jpg)
Sivaji Movie
టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజైన మురారి, మాస్, గబ్బర్ సింగ్ సినిమాలు భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.
తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'శివాజీ' మూవీ సైతం రీ రిలీజ్ కాబోతుంది.సెప్టెంబర్ 20న 4K వర్షన్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఎంపిక చేసిన స్క్రీన్‌లలో మాత్రమే 'శివాజీ' రీ రిలీజ్ ఉండబోతున్నట్లు సమాచారం. సినిమా టికెట్ కూడా కేవలం 99 రూపాయలు మాత్రమే ఉండనుంది. కాగా 2007 లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.
𝙇𝙤𝙘𝙠𝙚𝙙 & 𝙇𝙤𝙖𝙙𝙚𝙙 🔐💥#Sivaji4K Grand Re-Releasing On SEP20th In Theatre’s ❤️🔥❤️🔥
— Daya Arjun (@DayaArjun2) September 10, 2024
𝘽𝙤𝙤𝙠 𝙮𝙤𝙪𝙧 𝙩𝙞𝙘𝙠𝙚𝙩𝙨 𝙖𝙩 ₹𝟵𝟵 𝙤𝙣𝙡𝙮 (𝙨𝙚𝙡𝙚𝙘𝙩𝙚𝙙 𝙩𝙝𝙚𝙖𝙩𝙧𝙚𝙨) 😉🎟️🔥#SivajiTheBoss @rajinikanth @shankarshanmugh @arrahman @avmproductions @arunaguhan_ pic.twitter.com/vzORIgUxqe
ఆయనకు 'శివాజీ' 100వ సినిమా కావడం విశేషం. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సుమారు 17 ఏళ్ల తర్వాత మరోసారి రీరిలీజ్‌రూపంలో ఫ్యాన్స్ ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇక రజినీకాంత్ ప్రస్తుతం 'వేట్టయాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో 'వేటగాడు' పేరుతో రాబోతుంది.
'జై భీమ్' మూవీ ఫేమ్ జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటూ లోకేష్ కనగరాజ్ డైరెక్క్షన్ లో వస్తున్న'కూలీ' లోనూ యాక్ట్ చేస్తున్నారు.