/rtv/media/media_files/2025/03/08/Y6dcOPqaYFFk2gF5vIpl.jpg)
Jailer 2 Updates
Jailer 2 Updates: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)ముత్తవేల్ పాండియన్ గా నట విశ్వరూపం చూపిన మూవీ జైలర్.. 10 August 2023న విడుదలైన ఈ మూవీ 600 కోట్ల పైగా వసూళ్లు సాధించి రజినికాంత్ కెరీర్లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అయితే రజిని ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘జైలర్ 2’ కి ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. త్వరలో షూటింగ్ మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘జైలర్’ సూపర్ సక్సెస్ తర్వాత, నెల్సన్ డైరెక్షన్లో ‘జైలర్ 2’ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జైలర్ 2 స్క్రిప్ట్ తో రజిని ఫుల్ హ్యాపీగా ఉన్నారట, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి చేసాడట నెల్సన్.
Also Read: సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
తాజా సమాచారం ప్రకారం, రజిని 'జైలర్ 2' షూటింగ్ కి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. వచ్చే వారం చెన్నైలో ఈ మూవీ చిత్రీకరణ మొదలు కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదట షెడ్యూల్ కూడా భారీ యాక్షన్ సీన్ తో ప్రారంభిస్తున్నారు. తర్వాత షెడ్యూల్ గోవాలో జరపనున్నారు.
Also Read: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు
భారీ బడ్జెట్ తో 'జైలర్ 2'..
అలాగే, 'జైలర్’ లో నటించిన మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు కూడా పార్ట్ 2లో కూడా కొనసాగుతాయని సమాచారం. ఇంకొంత మంది స్టార్స్ కూడా ఈ మూవీ లో జాయిన్ అవుతున్నారని సమాచారం. ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల పైగా వసూళ్లు సాధించడంతో, సెకండ్ పార్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట.
ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. లొకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్నఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కూలీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, ‘జైలర్ 2’ షూటింగ్ కూడా ఇప్పటివరకు ఆలస్యం అవుతూ వచ్చింది. నెల్సన్ రజిని జైలర్ 2 తో ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి.