రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇంటికి చేరిన తలైవా

అనారోగ్యంతో ఇటీవలే ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజినీ ఆరోగ్యంగా తిరిగిరావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

New Update
Rajinikanth

Rajinikanth

Rajinikanth :  సెప్టెంబర్ 30న తీవ్ర అస్వస్థతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న రాత్రి 11 గంటలకు  రజినీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. రజినీకాంత్ ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గుండెలో స్టెంట్

రజినీకాంత్ కు గుండెలోని ప్రధాన రక్తనాళాలో వాపు ఏర్పడడంతో.. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించిన వైద్యులు చికిత్స ఆయనకు గుండెలో స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రజినీ హాస్పిటల్ లో చేరారని తెలియడంతో అభిమానులతో సహా సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

Also Read:  దుమ్మురేపుతున్న శివజ్యోతి 'నగాదారిలో' బతుకమ్మ సాంగ్.. చూశారా?

రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వెట్టయాన్, కూలీ సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'వెట్టయాన్' దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న కూలీ విషయానికి వస్తే.. రజినీ పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండడంతో ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే మొదలు పెట్టనున్నారట. లోకేష్ కనగరాజ్  తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
Also Read:  'నీతో ఇక బ్రేకప్..' జెనిలియాకు భర్త రితీశ్‌ మెసేజ్.. అసలేం జరిగింది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు