సుకుమార్ పని మనిషికి గవర్నమెంట్ జాబ్.. సెలబ్రేట్ చేసుకున్న డైరెక్టర్ ఫ్యామిలీ

సుకుమార్ భార్య ఓ గుడ్ న్యూస్ షేర్ చేశారు. తమ దగ్గర పనిమనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. మా ఇం‍ట్లో పనిచేస్తూ చదువు పూర్తి చేసిన దివ్య ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిందని, మేం ఆమెని మనస్పూర్తిగా అభినందించామని తెలిపారు.

New Update
tabita

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. 'పుష్ప2' రిలీజ్ కు ఇంకా కొద్ది రోజులు సమయం ఉండగానే వాళ్ళ ఫ్యామిలీ లో జరిగిన హ్యాపీ మూమెంట్ ను సుకుమార్ భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ దగ్గర పనిమనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని గుడ్ న్యూస్ షేర్ చేశారు.

' సినిమా హంగామాలోనూ మేమంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఎందుకంటే మా ఇం‍ట్లో పనిచేస్తూ చదువు పూర్తి చేసిన దివ్య.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఈ సందర్భంగా మేం ఆమెని మనస్పూర్తిగా అభినందించాం. దివ్య.. మేం నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం..' అంటూ సుకుమార్ భార్య పోస్ట్ లో పేర్కొన్నారు. 

Also Read : వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?

సుకుమార్ వల్లే..

అలాగే హ్యాపీ మూమెంట్ కు సంబంధించి ఓ ఫొటో కూడా షేర్ చేశారు. దీంతో సుకుమార్ భార్య పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సుకుమార్ పనిమనిషికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సదరు పని మనిషికి గవర్న మెంట్ జాబ్ రావడానికి కారణం సుకుమారే అని సమాచారం. 

ఆయన స్వయంగా తన సొంత ఖర్చుతో పని మనిషిని చదివించారట. ఆ అమ్మాయి టాలెంట్ చూసే సుకుమార్ ఆమెను ఉన్నత చదువులు చదివించి తమ ఇంట్లో సొంత మనిషిలా చూసుకున్నారట. ఆయనతో పాటూ ఫ్యామిలీ అంతా ఆమెకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక 'పుష్ప 2' విషయానికొస్తే.. డిసెంబర్ 5 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Also Read : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు