కథ లేకుండానే 'పుష్ప' తీశా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సుకుమార్

'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ 'పుష్ప' జర్నీ ఎలా స్టార్ట్ అయిందో వివరించారు. ఈ సినిమా ఎలా ఉంటుందో ఒకట్రెండు సన్నివేశాలతో చెప్పాను తప్ప ముందు నా దగ్గర కథ లేదు. తను నమ్మి నన్ను ప్రోత్సహించిన విధానం చూశాక ఏదైనా చేయొచ్చు అనిపించిందని అన్నారు

New Update

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప ది రూల్' ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు రెండు రోజులు ఉన్న నేపథ్యంలో మూవీ టీమ్ నిన్న రాత్రి యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ‘వైల్డ్‌ ఫైర్‌ జాతర’  పేరుతో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప' జర్నీ ఎలా స్టార్ట్ అయిందో వివరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.." ఈ సినిమా చేయడం వెనక అల్లు అర్జున్‌పై ప్రేమ తప్ప మరేమీ కాదు. మా ఇద్దరి మధ్య బంధం అనేది శక్తి, ఉత్సాహాలు ఇచ్చి పుచ్చుకోవడంలా ఉంటాయి. తనతో మాట్లాడుతున్నప్పుడు, తనకి సన్నివేశం చెబుతున్నప్పుడు తను నాకు ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంటుంది. 

Also Read : ఏపీలో ‘పుష్ప2’ టికెట్‌ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

 బన్నీని మూడేళ్లు కష్టపెట్టా..

ఈ సినిమా ఎలా ఉంటుందో ఒకట్రెండు సన్నివేశాలతో చెప్పాను తప్ప ముందు నా దగ్గర కథ లేదు. తను నమ్మి నన్ను ప్రోత్సహించిన విధానం చూశాక  ఏదైనా చేయొచ్చు అనిపించింది. తనని మూడేళ్లు కష్టపెట్టాను. తను నా కోసం మళ్లీ మూడేళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉంటే ‘పుష్ప3’ చేస్తా. మా నిర్మాతలు సినిమా కోసం గొప్ప వేదికని ఏర్పాటు చేశారు.  రష్మిక ఏం చెప్పినా వెళ్లి చేసేస్తుంది. తన క్లోజప్‌ చూస్తూ కూర్చునేవాణ్ని. దేవిశ్రీప్రసాద్‌తో నా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.." అని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు