Actor Suhas: తెలుగులో వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న యంగ్ హీరో సుహాస్.. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'మండాడి' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ సినిమాలో సుహాస్ పాత్ర గురించి కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
నేను విలన్ మాత్రమే
ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో సూరీ హీరోగా కనిపించగా.. తెలుగు వెర్షన్ లో సుహాస్ హీరోగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సుహాస్. 'మండాడి' తెలుగు, తమిళ్ వెర్షన్స్ లో తాను విలన్ పాత్ర మాత్రమే పోషిస్తున్నానని.. యాక్టర్ సూరీ హీరోగా నటిస్తున్నారని తెలిపారు.
Hello. This is a small clarification on my upcoming Tamil film #Mandaadi, which will also have a Telugu release. Unlike all the speculated rumours, I'll be playing only the Antagonist and Soori anna will be the Protagonist.
— Suhas 📸 (@ActorSuhas) May 6, 2025
అలాగే ఈ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ ఫుల్ గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో సుహాస్ తమిళ్ ఎంట్రీ.. అతడికి మంచి ఆరంభం కానుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో
మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
Here is the first look of #Mandaadi
— Suhas 📸 (@ActorSuhas) May 5, 2025
Can't wait to ride and rule the sea with @sooriofficial Anna 🤗🌊@elredkumar @rsinfotainment #VetriMaaran @MathiMaaran @gvprakash @Mahima_Nambiar #Achyuthkumar @RavindraVijay1 #Sathyaraj pic.twitter.com/ZLUSKisaHe
telugu-news | cinema-news | actor-suhas