'మా నాన్న సూపర్ హీరో' టీజర్.. డైలాగ్స్ తో ఏడిపించేసిన సుదీర్ బాబు

సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ తోనే చెప్పేశారు. టీజర్ లో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

sudheer babu
New Update

Maa Nanna Super Hero Teaser

టాలీవుడ్ లో మహేష్ బాబు బావగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలు కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపే ఈ హీరో గత కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొంతకాలంగా సుధీర్ బాబు చేసే సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి.

రీసెంట్ ఈ హీరో నటించిన 'హరోం హర' మూవీ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కానప్పటికీ.. సినిమాలో సుదీర్ బాబు పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. 'హరోం హర' మూవీతో యాక్షన్ హీరోగా అదరగొట్టిన సుదీర్ బాబు.. ఈసారి ఓ ఎమోషనల్ మూవీతో రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. లూజర్‌ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

వీ సెల్యూలాయిడ్స్‌, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై రూపొందుతున్నఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ విషయానికొస్తే.. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ తోనే చెప్పేశారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ తో టీజర్ మొదలైంది.

'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు' లాంటి ఎమోషనల్ డైలాగ్స్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

#sudheer-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe