Prabhas Fauzi: ప్రభాస్ చిన్నప్పటి రోల్ కోసం స్టార్ హీరో కొడుకు..! ప్లాన్ మాములుగా లేదుగా..

హీరో సుధీర్ బాబు కొడుకు దర్శన్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రంలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

New Update
Prabhas Fauzi

Prabhas Fauzi

Prabhas Fauzi: సిక్స్ ప్యాక్ బాడీ తో యాక్టింగ్ టాలెంట్ తో యూత్ లో తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకున్నారు Sudheer Babu. ఆయన నవంబర్ 7, 2025కి తన తాజా చిత్రంగా Jatadhara ను సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే, ఆయనకు సంబందించిన విషయం ఒకటికి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, Sudheer Babu చిన్న కొడుకు Darshanను Fauziలో స్టార్ హీరో Prabhas చిన్నప్పటి పాత్రగా చూపించనున్నారని అంటున్నారు. సీతా రామం లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Prabhas చిన్నపటి రోల్‌ కోసం..

మీడియా వర్గాల ప్రకారం, Darshan గతంలో Goodachari చిత్రంలో చిన్న పాత్రతో కనిపించాడు, ఇప్పుడు Fauzi లో Prabhas చిన్నపటి రోల్‌ కోసం ఫిల్మ్ టీమ్ అతన్ని ఎంపిక చేసిందని తెలుస్తోంది. అయితే, దీని పై Fauzi చిత్రబృందం లేదా Sudheer Babu ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, Prabhas ప్రధాన పాత్రలో కనిపించనున్న Fauzi చిత్రం పెద్ద స్కేలులో తెరకెక్కుతోంది. Mythri Movie Makers ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్‌గా Iman Esmail (‘ఇమాన్వి’) పరిచయం అవుతున్నారు. అలాగే, నటీనటీనటులకు
Mithun Chakraborty, Jayaprada, Chaitra J Achar ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. Vishal Chandrashekhar ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే, fauzi రిలీజ్ డేట్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ప్రమోషన్ వివరాలు కూడా త్వరలో తెలియనున్నాయి. సుధీర్ బాబు కొడుకు దర్శన్  Prabhas చిన్నప్పటి రోల్‌లో కనిపిస్తాడనే వార్త నిజమేనా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. 

Advertisment
తాజా కథనాలు