Srija Dammu : బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దమ్ము శ్రీజ సంచలన వీడియో

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దమ్ము శ్రీజ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఎలిమినేషన్‌ నుంచి కోలుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఎలిమినేషన్‌ తర్వాత బిగ్ బాస్ నుంచి ఇప్పటికీ ఒక్క ఎపిసోడ్‌ కూడా చూడలేదంది.

New Update

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దమ్ము శ్రీజ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఎలిమినేషన్‌ నుంచి కోలుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఎలిమినేషన్‌ తర్వాత బిగ్ బాస్ నుంచి ఇప్పటికీ ఒక్క ఎపిసోడ్‌ కూడా చూడలేదంది.  దీపావళి సెలబ్రేషన్‌ టైమ్‌లో హౌస్‌లో తాను ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌ను చాలా మిస్ అవుతున్నానని వెల్లడించింది.  అగ్నిపరీక్షలో 5 లెవల్స్‌ దాటుకుని బిగ్‌బాస్‌ వరకు వెళ్లానని,  బిగ్‌బాస్‌ కోసం ఒక పర్మినెంట్‌ ట్యాటూ కూడా వేయించుకున్నానని చెప్పుకొచ్చింది.

జర్నీ వీడియో లేకుండా

బిగ్‌బాస్ చరిత్రలోనే ఒక జర్నీ వీడియో లేకుండా..  బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ తానే అంటూ శ్రీజ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్‌లోకి శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీజను మళ్లీ తీసుకోవాలని బిగ్‌బాస్ టీమ్‌కు ఫ్యాన్స్ మెసేజులు పెడుతున్నారు. బిగ్ బాస్ ఐదవ వారంలో ఆమె డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు శ్రీజ. ఆమె ఎలిమినేషన్ నిర్ణయంపై ప్రేక్షకులు మరియు విశ్లేషకులు విమర్శలు చేశారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కాకుండా, వైల్డ్ కార్డ్ ఎంట్రీల నిర్ణయం ఆధారంగా ఆమెను ఎలిమినేట్ చేయడం అన్యాయమని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఆమె ఎలిమినేషన్ సమయంలో కనీసం జర్నీ ఏవీ (వీడియో) కూడా చూపించలేదు. హౌస్‌లో ఉన్న కాలానికి ఆమె వారానికి దాదాపు రూ. 60,000 నుండి రూ. 70,000 వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. హౌస్‌లోకి రాకముందు ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా గుర్తింపు పొందారు శ్రీజ. బిగ్ బాస్‌కు రాకముందు ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఇండస్ట్రీపై ఆసక్తితో అధిక జీతం వచ్చే తన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చారు. ఆమె తండ్రి జీవీఎంసీ ఉద్యోగి. 

#akkineni-nagarjuna #bigg boss telugu 9 #bigg-boss-telugu #Srija Dammu
Advertisment
తాజా కథనాలు