సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన శ్రీరెడ్డి.. ఎలాంటి ఫొటో షేర్ చేసిందో చూడండి!

కొద్ది రోజులు సోషల్ మీడియాలో కనిపించని శ్రీరెడ్డి.. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. తాజాగా ఎక్స్ లో తన ఫొటో షేర్ చేసింది. అది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్.. 'శ్రీరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిందంటూ'.. కామెంట్స్ పెడుతున్నారు.

New Update
srireddy01

నటి శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు సృష్టిస్తూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ప్రతి విషయంలోనూ వేలు పెడుతూ చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అయితే గత వైసీపీ హయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయింది. అప్పటి ప్రతిపక్ష నాయకులపై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది. 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తరచూ వీడియోలు రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా 2024 ఎలక్షన్ టైంలో జగనే సీఎం అంటూ.. మళ్లీ జగన్ సీఎం అయితే ఒక్కొక్క ప్రతిపక్ష నాయకుడికి తాటతీస్తా అని వీడియోలు షేర్ చేసింది. 

ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్..

కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత శ్రీరెడ్డిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. దాంతో తప్పు తెలుసుకున్న శ్రీరెడ్డి చంద్రబాబు, పవన్, లోకేష్ కి క్షమాపణ కోరుతూ లెటర్ రాసింది. ఆ తర్వాత కొద్ది రోజులు సోషల్ మీడియాలో కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. 

శ్రీరెడ్డి తాజాగా ఎక్స్ లో తన ఫొటో ఒకటి షేర్ చేసింది. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ శ్రీరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.. ఈసారి ఎలాంటి పోస్టులు చేస్తుందో.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు