/rtv/media/media_files/2025/06/01/yR7LCu5IzXiToQwg0tP7.jpg)
Sreeleela birthday photos
Actress Sreeleela: టాలీవుడ్ డాన్సింగ్ ఖ్వీన్ శ్రీలీల ఈ నెల 14న తన 24వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లి శ్రీలీల కోసం ఒక సర్ప్రైజ్ వేడుకను నిర్వహించారు. పెళ్లి రేంజ్ లో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
పెళ్లి రేంజ్ లో బర్త్ డే
మొదట ఈ వేడుకకు సంబంధించిన అలంకరణలు, ఏర్పాట్లు చూసి అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. "ఇది పుట్టినరోజా, లేక పెళ్లి వేడుకా?'' అనే అనుమానంలో పడ్డారు! ఆ తర్వాత శ్రీలీల తన ఇన్ స్టాగ్రామ్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది.
/rtv/media/media_files/2025/06/01/sreeleela-birthday-photos-fifth-pic-426503.jpg)
ఈ వేడుక కోసం శ్రీలీల ఆకుపచ్చ-బంగారు కలర్ చీర, గాజులు, మెడలో భారీ హారాలు ధరించి అందంగా ముస్తాబైంది. అచ్చం పెళ్లి కూతురు లానే ఇద్దరు వ్యక్తులు శ్రీలీలను బుట్టలో కూర్చోబెట్టుకొని స్టేజ్ పైకి తీసుకెళ్లారు. తనను బుట్టలో మోసుకెళ్తుంటే శ్రీలీల సంతోషంతో మురిసిపోయారు. శ్రీలీల బర్త్ డే వేడుకల్లో రానా దగ్గుబాటి భార్య మిహీకా కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను శ్రీలీల తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/06/01/sreeleela-birthday-photos-fourth-pic-254838.jpg)
పూర్వం సంప్రదాయం
అయితే పూర్వం తమ ఇంట్లో ఇలా పూర్తి సంప్రదాయాలతో బర్త్‌డేలు జరుపుకునేవారట. అలాగే ఈసారి తన అమ్మ తన కోసం ఈ విధంగా ప్రీ బర్త్ డే వేడుకలను నిర్వహించినట్లు శ్రీలీల తెలిపారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... శ్రీలీలకు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ''బ్యూటిఫుల్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/06/01/sreeleela-birthday-photos-second-pic-614239.jpg)
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె రవితేజ సరసన 'మాస్ జాతర ', పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. త్వరలో బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆషిక్3 తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి 2025లో విడుదల కానుంది.