/rtv/media/media_files/2024/10/25/NoZizXKJI15RDydNZBXo.jpg)
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శ్రీవిష్ణు ఇటీవల 'స్వాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. శ్రీవిష్ణు సూపర్ హిట్ ఫిలిం 'రాజ రాజ చోర' సినిమాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కింది. హసిత్ గోలి దర్శకత్వం వహించారు. రీతూ వర్మ, దక్ష నగార్కర్, మీరా జాాస్మిన్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 4 న థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా సినిమాలో మంచి కంటెంట్ ఉండటం, శ్రీవిష్ణు నాలుగు విభిన్న తరహా పాత్రల్లో అద్భుతంగా నటించడంతో ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
#SWAGTheFilm Streaming Now on @PrimeVideoIN 🤩 ~ #Swagpic.twitter.com/hNIteL9wzO
— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 25, 2024
Also Read : పొలిటికల్ ఎంట్రీపై 'సుప్రీం' హీరో కామెంట్స్.. ఫోకస్ అంతా దానిపైనే అంటూ
అమెజాన్ ప్రైమ్ లో..
ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. రిలీజ్ అయిన ఇరవై రోజుల వ్యవధిలోనే ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. 'స్వాగ్' ను థియేటర్స్ లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. చూసేయండి..
#SWAG is now streaming on @PrimeVideoIN
— OTT Updates (@itsott) October 25, 2024
Language: Telugu#Pushpa2TheRule#Prabhas#Pushpa2#SWAG#Devara#LuckyBaskhar#Riya#NBK109#Unstoppable4OnAha#gistloverpic.twitter.com/Pgy2yUkyjd
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటి మీరా జాాస్మిన్, రీతూ వర్మ ఇద్దరూ డ్యూయెల్ రోల్ లో నటించారు. గోప రాజు రమణ, ప్రదీప్, సునీల్, రవిబాబు, శరణ్య, గెటప్ శ్రీను, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
 Follow Us