హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇటీవలే నాగ చైతన్యను పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంత కాలం పాటూ సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేసిన ఈ జంట.. డిసెంబర్ 4 న పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత చైతూతో తొలి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడింది. 2022లో చైతూతో స్నేహం.. 2018లో మొదటిసారి తాను నాగార్జున ఇంటికి వెళ్లానని, 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలయ్యిందని తెలిపారు.' నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య నన్ను తరచూ అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడింది. Also Read : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? నాకోసం ముంబై వచ్చేవాడు.. నేను ఎప్పుడూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. నేను పెట్టే గ్లామర్ ఫొటోలు కాకుండా .. స్ఫూర్తిమంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లను నాగచైతన్య లైక్ చేసేవాడు..' అని తెలిపారు. ఇక తమ ఫస్ట్ మీటింగ్ గురించి మాట్లాడుతూ..' ముంబయిలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిశాను. అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబయిలో ఉండేవాళ్లం. నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవాడు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే..' అంటూ చెప్పుకొచ్చింది. Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!