/rtv/media/media_files/2025/10/13/sivakarthikeyan-parashakti-2025-10-13-13-40-09.jpg)
Sivakarthikeyan Parashakti
Parasakthi: తాజాగా 'మధరాసి' సినిమాతో మిక్స్డ్ టాక్ పొందిన శివకార్తికేయన్(Sivakarthikeyan), ఇప్పుడు 'పరాశక్తి' అనే భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ప్రతిష్టాత్మకంగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
#Sivakarthikeyan#Parashakthipic.twitter.com/kjjnBq2Anq
— 𝗠𝖚𝖑𝖙𝖎𝖕𝖑𝖊𝖝 (@Multiplex312) October 10, 2025
ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. శివకార్తికేయన్, శ్రీలీల జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో, వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్‌కి తోడుగా రవి మోహన్, అథర్వా, రానా దగ్గుబాటి, బాసిల్ జోసఫ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్యాస్టింగ్ చూస్తే సినిమా బలమైన స్టోరీతో, మల్టీస్టారర్ ఫీల్‌తో తెరకెక్కిందని అర్థమవుతోంది.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా జి.వి. ప్రకాష్ కుమార్ పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
'పరాశక్తి' సినిమా ఒక కాలానికి చెందిన కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో, ఇందులో ఎమోషన్, యాక్షన్, డ్రామా కలబోసిన కథ ఉండనుందని ఇండస్ట్రీ టాక్. దర్శకురాలు సుధా కొంగర గతంలో 'సూరారై పోట్రు' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చినందున, ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడంతో, రిలీజ్ డేట్ వరకు సినిమా ప్రచారం ఊపందుకోనుంది. సంక్రాంతి 2026లో విడుదలయ్యే ఈ సినిమా పండుగ బరిలో మిగతా సినిమాలతో ఎలా పోటీ పడతుందో చూడాలి.