Siddharth Marriage: ఘనంగా సిద్దార్థ్- అదితి పెళ్లి.. !

హీరో సిద్దార్థ్, నటి అదితి మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ఉదయం వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Archana
Siddharth- Aditi Marriage

siddharth - aditi marriage

New Update

Siddharth - Aditi Marriage:  టాలీవుడ్ హీరో సిద్దార్థ్, నటి అదితి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.  తెలంగాణ వనపర్తి జిల్లాలోని 400 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం వీరిద్దరి వివాహం జరిగింది. అదితి పూర్వీకులకు కొన్నేళ్లుగా ఆ గుడితో అనుబంధం ఉండడంతో సెటిమెంట్ గా ఆమె ఆ గుడిలోనే పెళ్లి చేసుకోవని నిర్ణయించుకున్నారు. అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య అదితి - సిద్దార్థ్ వివాహ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. 

Also Read :  కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్!

సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన సిద్దార్థ్ 

హీరో సిద్దార్థ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి గురించి తెలియజేస్తూ.. పెళ్ళి ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన సెలెబ్రెటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ సిద్దార్థ్- అదితి సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read :  Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు!

సిద్దార్థ్- అదితి 'మహా సముద్రం' సినిమాలో కలిసి నటించారు.  ఆ సమయంలో ఏర్పడిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది మార్చిలో తమ రిలేషన్ ను బయటపెట్టి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు అంటే సెప్టెంబర్ 16న మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. 

Also Read :  SIIMA Awards 2024: సైమా అవార్డ్స్ వేదిక పై తారల సందడి.. ఫొటోలు వైరల్!

Also Read :  ఉత్తమ చిత్రం 'భగవంత్ కేసరి'... ఉత్తమ నటుడిగా..?

#tollywood #hero-siddarth #aditi-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe