Kaliyugam: ఓటీటీలో 'కలియుగం 2064'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా "కలియుగం"  మే 9న థియేటర్లలో విడుదలై  మంచి స్పందనలు సొంతం చేసుకుంది.  ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.

New Update

Kaliyugam:   శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా "కలియుగం"  మే 9న థియేటర్లలో విడుదలై  మంచి స్పందనలు సొంతం చేసుకుంది.  ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.  జూలై 11, 2025 నుంచి   ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో లో స్ట్రీమింగ్ కానుంది. "కలియుగం" తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

'కలియుగం' కథేంటి?

 2064లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే ఐడియాతో ఈ సినిమాను రూపొందించారు. ఆహారం, నీరు దొరకక , శాంతి కరువవుతుంది. విపత్తులతో నిండిన భవిష్యత్తులో, మనుషులు బ్రతకడం కోసం ఎంత కష్టపడతారో ఈ సినిమా చూపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో భూమి అనే పాత్రలో నటించింది. నటుడు  కిషోర్  శక్తి అనే పాత్రలో నటించారు.  

కొత్త దర్శకుడు

ప్రమోద్ సుందర్ అనే కొత్త దర్శకుడు ఈ "కలియుగం" సినిమాను రూపొందించారు. ఇది ఒక పోస్ట్-అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్. అంటే, ప్రపంచం అంతమైపోయిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారతాయి అనే అంశంపై ఈ సినిమా దృష్టి పెడుతుంది. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్  కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.  థియేటర్లలో చూడలేకపోయిన వారు, ఇప్పుడు ఈ సినిమాను ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ఎంజాయ్ చేయండి. 

దీంతోపాటు ఈ వారం మరికొన్ని చిత్రాలు, సీరీస్ లు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. ఫుల్ సినిమాల లిస్ట్ ఇక్కడ చూడండి. 

  • ఉప్పు కప్పురంబు- అమెజాన్ ప్రైమ్ (జులై 4 నుంచి స్ట్రీమింగ్)
  • గుడ్ వైఫ్- జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  •  ‘ది హంట్‌’..  ది రాజీవ్‌ గాంధీ అసాసినేషన్‌ కేస్‌: ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ 
  • శ్రీశ్రీ రాజావారు: స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్
  • మద్రాస్ మ్యాట్నీ-  స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్
  • జురాసిక్ వరల్డ్ రీబర్త్ (డాక్యుమెంటరీ): జియో హాట్ స్టార్  

Also Read: Fish Venkat: ప్రభాస్‌ 50 లక్షల సహాయంలో బిగ్‌ ట్విస్ట్‌.. ఫిష్ వెంకట్ కూతురు షాకింగ్ వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు