/rtv/media/media_files/2025/09/27/chhoti-stree-2025-09-27-17-26-55.jpg)
Chhoti Stree
Chhoti Stree: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. మద్దోక్ ఫిలింస్ రూపొందించిన తాజా సినిమా 'థమ్మా' ట్రైలర్ లాంచ్(Thamma Trailer Launch) ఈవెంట్‌లో, శ్రద్ధా కొత్త ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ‘ఛోటి స్ట్రీ’ అనే అనిమేటెడ్ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్ చేయగల కామెడీ & అడ్వెంచర్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. మునుపటి మద్దోక్ హర్రర్ కామెడీ సినిమాలు భయాన్ని కలిగించేలా ఉంటే, ఈసారి మేకర్స్ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫోకస్ చేశారు.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
‘ఛోటి స్ట్రీ’ అనేది శ్రద్ధా కపూర్ నటించిన ఓ ఫేమస్ పాత్రకు సంబంధించిన బ్యాక్‌స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది. దీన్ని మద్దోక్ హర్రర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిస్తున్నారు. ఈ యూనివర్స్ 2018లో విడుదలైన బ్లాక్‌బస్టర్ ‘స్ట్రీ’ సినిమాతో ప్రారంభమైంది. తర్వాత 'రూహి', 'భేడియా', 'ముంజ్యా' వంటి సినిమాలు కూడా ఈ యూనివర్స్‌లో వచ్చాయి.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
శ్రద్ధా కపూర్ ''చోటి స్త్రీ''..
తాజా సమాచారం ప్రకారం, ‘ఛోటి స్ట్రీ’ కథ చివర్లో స్ట్రీ 3కు డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ అనిమేటెడ్ సినిమా చివరలో లైవ్ యాక్షన్ సీన్ ద్వారా స్ట్రీ 3 కథలోకి మారుతుంది. ఇది ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించనుంది. ‘స్ట్రీ 3’ సినిమా విడుదలకి ఆరు నెలల ముందు 'ఛోటి స్ట్రీ' రాబోతోంది.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ప్రొడ్యూసర్ దినేష్ విజన్ మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు అమర్ కౌశిక్, రచయిత నిరన్ భట్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇది హర్రర్ కామెడీ యూనివర్స్‌లో మళ్లీ కొత్త అధ్యాయానికి తెరలేపుతుంది" అన్నారు. మద్దోక్ ఫిలింస్ తదుపరి సినిమా 'థమ్మా' అక్టోబర్ 21, 2025న విడుదల కానుంది. కాగా, 'స్ట్రీ 2' ఇప్పటికే 2024లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి హిందీలో ఏడాది పెద్ద హిట్‌గా నిలిచింది.