Cinema: డైరెక్టర్ గా షారుఖ్ ఖాన్ కొడుకు..  'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ అదిరింది!

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా  ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ ను విడుదల చేశారు.

New Update

Cinema: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా  ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ ను విడుదల చేశారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలోని చీకటి కోణాలు, సమస్యలు, వాటి వల్ల కలిగే కష్టాలను ఆర్యన్ ఖాన్ ఈ సీరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  అలాగే సినిమా రంగంలో ఎదురయ్యే  ఇబ్బందులను, చెడు విషయాలను కూడా ఈ చిత్రంలో చూపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. లక్ష్య, సహేర్, బాబీ దేవోల్, రాఘవ్ ఇందులో కీలక పత్రాలు పోషించగా, సల్మాన్‌ఖాన్‌, రణ్‌వీర్‌సింగ్‌ క్యామియో రోల్స్ లో సందడి చేయనున్నారు. అంతేకాదు షారుఖ్ ఖాన్ కూడా నటించారని తెలుస్తోంది. 

ట్రైలర్ తో పాటు సీరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. షారుఖ్ ఖాన్ సొంత  నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాతో ఆర్యన్ ఖాన్ తొలిసారి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. 

ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ చిన్నతనంలోనే యాక్టింగ్ కేరీర్ మొదలు పెట్టాడు. 2001లో 'కభీ ఖుషీ కభీ గమ్' సినిమాలో చిన్నప్పటి షారుక్ ఖాన్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత 2019 లో విడుదలైన "ది లయన్ కింగ్" హిందీ వెర్షన్ లో సింబా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అయితే ఆర్యన్ ఖాన్ నటన కంటే డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక షారుక్ కుమార్తె సుహనా కూడా ఇప్పటికే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2023లో విడుదలైన "ది ఆర్చీస్" అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంతో సుహనా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఇందులో ఆమె 'వెరోనికా లాడ్జ్' పాత్రలో నటించారు. అంతేకాదు ఈ సినిమాలో ఒక పాట కూడా పాడారు. నెక్స్ట్ సుహనా తన తండ్రి షారుక్ రాబోయే చిత్రం 'కింగ్' లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారుక్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు