Aryan Khan: సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డేటింగ్..? వీడియో వైరల్
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసితో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ నైట్ పార్టీలో కనిపించడం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమేనంటూ ప్రచారం జరుగుతోంది.