Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు భారీ ప్రమాదం..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్' షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వైరలవుతున్నాయి. యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా ఆయన కండరాలకు గాయాలైనట్లు తెలుస్తోంది.

New Update
shah rukh khan injured in king movie shooting sets

shah rukh khan injured in king movie shooting sets

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన తాజా చిత్రం 'కింగ్' షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయన కండరాలకు గాయం అయినట్లు తెలుస్తోంది. 

shah rukh khan injured

గాయం తీవ్రతపై అధికారికంగా స్పష్టత లేనప్పటికీ.. చికిత్స నిమిత్తం షారుఖ్ ఖాన్ తన బృందంతో కలిసి అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఈ గాయం కారణంగా 'కింగ్' సినిమా షూటింగ్ ను సెప్టెంబర్/అక్టోబర్ వరకు వాయిదా వేసినట్లు సమాచారం. 

కాగా ఇది అంత తీవ్రమైన గాయం కానప్పటికీ, యాక్షన్ సన్నివేశాలలో సంవత్సరాలుగా స్టంట్స్ చేయడం వల్ల కలిగిన కండరాల సమస్య అని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. షారుఖ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు