తిరుమల లడ్డు వివాదంపై మంచు మోహన్ బాబు స్పందన.. నీచం, నికృష్టం అంటూ

తిరుమల లడ్డు వివాదంపై మోహన్ బాబు స్పందించారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్త తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయానని అన్నారు. ఇలా జరగడం ఘోరం, పాపమని, ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

mohan babu
New Update

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్త తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపమని, ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు." ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. 

తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నిత్యం 'మోహన్‌బాబు విశ్వవిద్యాలయం' నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు వేల మంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. 

Also Read : భర్తకు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స, షాక్ లో 'పవన్' హీరోయిన్

నేరస్థులను శిక్షించాలి..

ఇదే నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ... ఈ కలియుగ దైవం శ్రీనివాసుని ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ప్రకటనలో తెలిపారు. 

ఇక మోహన్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన కొడుకు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ ఠీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

#mohan-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి