/rtv/media/media_files/F06XKfXv6CSf3Ay8790b.jpg)
ఒకప్పటి తెలుగు హీరోయిన్ ప్రీతి జింగ్యానీ భర్త పర్విన్ దాబాస్ కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. అతని వెంట ఆయన భార్య హీరోయిన్ ప్రీతి జింగ్యానీ ఉన్నారు.
ఐసీయూలో హీరోయిన్ భర్త..
ఈ దుర్ఘటనపై ఆయన టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.' బాలీవుడ్ నటుడు మరియు ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్విన్ దబాస్ శనివారం తెల్లవారుజామున దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నాడు. ఇది తెలియజేయడానికి మేము చాలా చింతిస్తున్నాము. అయితే ఈ క్లిష్టతర సమయంలో మా ఆలోచనలు పర్విన్ మరియు అతని కుటుంబ సభ్యులతో ఉంటాయి.
Also Read : 'దేవర' వీఎఫ్‌ఎక్స్.. 30 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం : సినిమాటోగ్రాఫర్
#ParvinDabas, a prominent Bollywood actor and co-founder of the Pro Panja League, was hospitalized following a car accident
— The Times Of India (@timesofindia) September 21, 2024
He is currently receiving treatment in the ICU at Holy Family Hospital in Bandra
Know more https://t.co/4qHJPsK4JW pic.twitter.com/7swdWd6Gfk
అలాగే పర్విన్ దాబాస్ హెల్త్ అప్‌డేట్‌లను అందిస్తాము. పర్విన్ త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము' అని ప్రకటనలో తెలిపారు. ఇక పర్విన్ దాబాస్ బాలీవుడ్ లో మాన్సూన్ వెడ్డింగ్, మైనే గాంధీ కో నహీ మారా, ది పర్ఫెక్ట్ హుస్బూండ్, మై నేమ్ ఇస్ ఖాన్ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రో పంజా లీగ్ అనే స్పోర్ట్స్ టీమ్‌కు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు.
#ParvinDabas has been hospitalised in the ICU at a Bandra hospital in Mumbai after a road accident on Saturday morning. His wife, actress #PreetiJhangiani, is with him. We wish @parvindabas a speedy recovery. pic.twitter.com/jUU7xD6aeN
— The Bollywood Reporter (@TBRIndia) September 21, 2024
ప్రీతి జింగ్యానీ పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. సినిమాలో తన సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నరసింహ నాయుడు, అధిపతి, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే, ఒట్టేసి చెబుతున్నా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా 2008 లో పర్విన్ దాబాస్‌తో ఆమెకు వివాహం జరిగింది.