Sean Baker: ఐ ఫోన్‌తో సినిమా.. 4 ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక నిర్మాత!

2025 ఆస్కార్ వేడుకల్లో డైరెక్టర్ సీన్ బేకర్ పేరు మారుమోగింది. 'అనోరా' చిత్రానికి నాలుగు విభాగాల్లో ఆస్కార్ గెలుచుకొని రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఒకప్పుడు సీన్ ఐఫోన్ తో సినిమాలను చిత్రీకరించారు. 2015లో 'టాన్జేరిన్' సినిమాను ఐఫోన్ 5ఎస్ తో షూట్ చేశారు.

New Update
Sean Baker

Sean Baker

Sean Baker: నటీనటులు తమ జీవితంలో కనీసం ఒక్క 'ఆస్కార్ అవార్డు' వచ్చినా మహా అదృష్టం అనుకుంటారు. అలాంటిది ఇతడిని మాత్రం ఒకేసారి ఏకంగా నాలుగు విభాగాల్లో 'ఆస్కార్' వరించింది. అతడు మరెవరో కాదు.. 2025 ఆస్కార్ వేడుకల్లో మారుమోగిన 'అనోరా' డైరెక్టర్ సీన్ బేకర్. ఈ చిత్రానికి మొత్తం 6 విభాగాల్లో ఆస్కార్ రాగా.. అందులో నాలుగు అవార్డులను డైరెక్టర్ సీన్ బేకర్ సొంతం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత  ఒకేసారి నాలుగు అవార్డులు అందుకున్న చిత్రనిర్మాతగా సీన్ రికార్డుసృష్టించాడు.  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే,  ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో అవార్డులను గెలుచుకున్నారు. 

ఒకేసారి నాలుగు 'ఆస్కార్' లతో రికార్డు  

 25 ఏళ్ల కెరీర్‌లో సీన్  మొత్తం 8 సినిమాలు చేశారు. అందులో 'అనోరా' ఆయన ఎనిమిదవ చిత్రం.  తన 8వ చిత్రానికే సీన్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని సీన్ నిర్మించడం, డైరెక్ట్ చేయడమే కాకుండా రైటర్, ఎడిటర్ గా కూడా పనిచేశారు. సీన్ ప్రత్యేకమైన చిత్రనిర్మాణ శైలికి 'అనోరా'  ప్రసిద్ధి చెందింది. 

sean baker oscars
sean baker oscars

 

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

ఐఫోన్ తో సినిమా షూట్.. 

నాలుగు ఆస్కార్ అవార్డుల విజేత సీన్ ఒకప్పుడు ఐ ఫోన్ తో తన సినిమాలను చిత్రీకరించేవారట. 2015లో ఆయన తీసిన 'టాన్జేరిన్' సినిమాను మూడు ఐఫోన్ 5ఎస్ లతో షూట్ చేశారట. ఈ సినిమాలో సీన్ చిత్రనిర్మాణ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2016లో 'స్నోబర్డ్' అనే ఫ్యాషన్ షార్ట్ ఫిల్మ్‌ ను కూడా ఐఫోన్‌లో చిత్రీకరించారు.  సీన్  2000 సంవత్సరంలో 'ఫోర్ లెటర్ వర్డ్స్' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. 

Also Read: Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు