/rtv/media/media_files/2025/11/29/prabhas-spirit-2025-11-29-17-55-57.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “స్పిరిట్” సినిమా ప్రారంభం నుంచి పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈసారి వంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటికి చేరకుండా చాలా స్ట్రిక్ట్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.
ప్రభాస్ లుక్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం, సందీప్ వంగా ప్రభాస్‌ను వచ్చే 6 నెలల పాటు పబ్లిక్‌లో కనిపించొద్దని కోరాడట. కారణం ప్రభాస్ స్పిరిట్‌లో కనిపించే లుక్ చాలా స్పెషల్‌గా ఉండటంతో, అది ఎక్కడా బయటికొచ్చే అవకాశం ఆయన ఇవ్వకూడదనుకుంటున్నాడు.
ప్రభాస్ ఎయిర్‌పోర్ట్‌లో, ఈవెంట్స్‌లో, బయట ఎక్కడ కనిపించినా, ఫ్యాన్స్, మీడియా ఫోటోలు క్లిక్ చేస్తారని. అలాంటి ఫోటోలు బయటికొస్తే, సినిమాలోని లుక్ సర్‌ప్రైజ్ మొత్తం పాడైపోతుందని వంగా భావిస్తున్నాడట. అందుకే వచ్చే 6 నెలలపాటు ప్రభాస్ ఏ ఈవెంట్‌కు హాజరు కావద్దు, ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించొద్దు, అని ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.
ఫ్యాన్స్ కు కాస్త నిరాశ.. ప్రభాస్ లైవ్‌గా కనిపించకపోవడం వల్ల ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు, మరోవైపు అతని కొత్త లుక్‌పై ఆసక్తి మాత్రం రెట్టింపైంది. సందీప్ వంగా స్టైల్‌కు తగ్గట్టు ప్రభాస్‌ను ఎలా డిజైన్ చేశాడో? ఏ లుక్‌లో చూపించబోతున్నాడో? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి.
Also Read : రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' షాకింగ్ రన్‌టైమ్.. ఎన్ని గంటలంటే..?
ఈ భారీ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. అదేవిధంగా వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, కంచన ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. బలమైన నటులు, భారీ బడ్జెట్, వంగా మార్క్ ఎమోషన్ ఇవన్నీ కలగలసి స్పిరిట్‌ను భారీ ప్రాజెక్టుగా నిలుపుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోంది. పూర్తిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో థియేటర్లలో విడుదల కావచ్చని సమాచారం.
Also Read: టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!
ఇంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్‌ను 6 నెలలపాటు పబ్లిక్‌కి దూరంగా ఉంచటం చిన్న విషయం కాదు. కానీ ఇది పూర్తిగా సినిమా కోసం తీసుకున్న నిర్ణయమనే టాక్ వినిపిస్తోంది. వంగా ప్రణాళిక ప్రకారం ప్రభాస్ లుక్ సినిమా విడుదలకు దగ్గరగా, భారీ ఈవెంట్‌లో లేదా టీజర్ ద్వారా బయటికొచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ ప్రజలకు ఆరు నెలలపాటు దూరంగా ఉండబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌ను కొంచెం బాధపెట్టినా, స్పిరిట్ మీద ఉన్న ఆసక్తిని మాత్రం మరింత పెంచింది. సందీప్ వంగా - ప్రభాస్ కాంబినేషన్ భారీ హైప్ కలిగించడంతో, స్పిరిట్ పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బడా హీరో.. ఏకంగా ఆ సినిమాతో కనెక్షన్..?
Follow Us