/rtv/media/media_files/2025/02/01/6FVbE3zfufTLxPZsUCOb.jpg)
Samantha Ruth Prabhu
కేరళకు చెందిన మిహిర్ అహమ్మద్ అనే 15 ఏళ్ల బాలుడు తన క్లాస్‌మేట్స్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అందరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటనపై స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత ... తొటి విద్యార్థిని హేళనగా చూడటం, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోందని వెల్లడించింది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నప్పటికీ ఇంకా ఇలాంటి పరిణామలు ఎదురుకోవడం బాధాకరమంది. ఈ ఘటనపై కేవలం సంతాపం తెలియజేయడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమంత డిమాండ్ చేసింది.
/rtv/media/media_files/2025/02/01/hSNZoGfZIaxt9ctKpNYI.jpg)
Also Read : డయాబెటిస్‌కు బిర్యానీ ఆకు దివ్య ఔషధం.. ఎలాగంటే!
ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నానని సమంత వెల్లడించింది. అంతేకాకుండా ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైనప్పుడు వాటి గురించి మౌనంగా ఉండకుండా బయటకు మాట్లాడాలని సామ్ చెప్పింది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండంటూ తన పోస్టులో వివరించింది.
Also read : బీహార్ కు బోనాంజా.. ఎన్నికల వేళ నిర్మలమ్మ భారీగా కేటాయింపులు.. లిస్ట్ ఇదే!
ర్యాగింగ్, బెదిరింపులు తట్టుకోలేక
ఎర్నాకులంలోని తిరువాణియూర్ ప్రాంతంలోని గ్లోబల్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న మిహిర్ అహమ్మద్ జనవరి 15 న క్రూరమైన ర్యాగింగ్, బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఘటన అందరినీ కలచివేసింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలని అభిప్రాయపడుతున్నారు. బాధ్యులని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : అప్పుడే వేసవి మొదలై పోయిందా..నిన్ననే 35 డిగ్రీలు నమోదు
Also Read : 10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది?