పొలిటికల్ ఎంట్రీపై 'సుప్రీం' హీరో కామెంట్స్.. ఫోకస్ అంతా దానిపైనే అంటూ

మెగా హీరో సాయి దుర్గా తేజ్ తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ..' తన ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉందని,. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని' చెప్పాడు.

sai tej
New Update

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల పరంగ మెగా ఫ్యామిలీ అంతా పవన్ ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అందులో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. 

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు..

ఏ విషయంలో అయినా మామను ఫాలో అయ్యే ఈ హీరో.. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన కార్యక్రమంలో సాయి తేజ్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.." నా ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉంది. మరెన్నో విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్‌ చేయాలని, ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నా. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు.

Also Read : కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. ఖంగుతిన్న పోలీసులు

పాలిటిక్స్‌లోకి రావాలంటే ఎన్నో విషయాలను నేర్చుకోవాలి. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిఉండాలి" అని అన్నారు. అలాగే తన యాక్సిడెంట్ రోజులను గుర్తు చేస్కుంటూ ఇది తనకు పునర్జన్మ అని చెప్పాడు. ఆ ప్రమాదం తర్వాత దాదాపు రెండు వారాలు తాను కోమాలోనే ఉన్నానని చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని.. అదే తన ప్రాణాలు కాపాడిందని వివరించారు. 

ఇక సాయి తేజ్ గతేడాది 'విరూపాక్ష' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం 'SDT18' అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇటీవల సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో భారీ రెస్పాన్స్ అందుకుంది.

Also Read : ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ థ్యాంక్స్.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్

#actor-sai-dharam-tej #sai-durga-tej
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe