The Family Man 3: రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ రూపొందించిన 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు సీజన్ 3తో రాబోతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రమోషనల్ వీడియో కూడా షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
MANOJ BAJPAYEE RETURNS WITH 'THE FAMILY MAN' SEASON 3... The wait is finally over... #AmazonPrimeVideo and creators #RajAndDK have confirmed 21 Nov 2025 as the global premiere date for the much-awaited third season of their series, #TheFamilyMan.#ManojBajpayee reprises his… pic.twitter.com/0xweg1SMV4
— taran adarsh (@taran_adarsh) October 28, 2025
సరికొత్తగా సీజన్ 3
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరీస్ లో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరి, హర్మన్ సింఘా, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, సందీప్ కిషన్, దర్శన్ కుమార్, సీమా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా మనోజ్ బాజ్‌పాయ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఇందులో శ్రీకాంత్, అతడి టీమ్ ఎదుర్కునే సమస్యలు, వ్యక్తులు మరింత ప్రమాదకరంగా ఉంటాయని తెలుస్తోంది.
సామ్ ఉంటుందా?
ఇదిలా ఉంటే సీజన్ 3 లో సమంత రోల్ ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతుంది అనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. సీజన్ 1 లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తూ అదరగొట్టింది సామ్. దీంతో సీజన్ 3లో ఆమె పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
Follow Us