/rtv/media/media_files/2024/12/13/siNWi9zLE815nrsaEchZ.jpg)
Regena Cassandrra
Regena Cassandrra: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'జాట్'. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఫుల్ యాక్షన్ తో సినిమా పై అంచనాలను పెంచేసింది.
Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు
రెజీనా బర్త్ డే స్పెషల్..
అయితే తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటి రెజీనా కసాండ్రా పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆకుపచ్చ ఫ్లోరల్ ప్రింటెడ్ చీరలో రెజీనా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ణ్‌దీప్ హుడా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Team #JAAT wishes the ever-alluring @ReginaCassandra a very Happy Birthday ❤🔥 pic.twitter.com/vshju2iZs7
— BA Raju's Team (@baraju_SuperHit) December 13, 2024
తెలుగులో 20 పైగా సినిమాలు చేసిన...రెజీనా స్టార్ హీరోలతో సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ్, హిందీలో పలు సినిమాలు సీరీస్ లు చేస్తోంది.
Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!