Pellikani Prasad: హైప్ అదిరింది.. ప్రభాస్ తో 'పెళ్లికాని ప్రసాద్' టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే

కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు పెళ్లికాని ప్రసాద్ టీజర్ ను ప్రభాస్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరలవుతోంది.

New Update
pellikani prasad teaser launch by

pellikani prasad teaser launch by

Pellikani Prasad:  స్టార్ కమెడియన్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని కె.వై. బాబు, భాను ప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

రెబల్ స్టార్ చేతుల మీదుగా 

రేపు  మధ్యాహ్నం 1:15 PM గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్  'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌కు విడుదల చేయగా.. సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. 

Also Read: NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్, కల్యాణ్‌ రామ్‌ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు