HBD Prabhas : రికార్డులకు అమ్మ మొగుడు.. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్

సినిమా పరిశ్రమలో హీరోలు గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ సినీ పరిశ్రమకే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన హీరో ప్రభాస్. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు మాత్రమే సాధ్యమైన రికార్డ్స్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

author-image
By Anil Kumar
praboss
New Update

'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్'.. 'మిర్చి' సినిమాలో ప్రభాస్ కోసం కొరటాల శివ రాసిన డైలాగ్ ఇది. ఆయన ఏం ఆలోచించి ఈ డైలాగ్ రాశాడో తెలీదు కానీ.. ఈ డైలాగ్ ప్రభాస్ కు సరిగ్గా సూట్ అవుతుంది. సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ.. ఈ రోజు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ చేసింది. 

మాములుగా సినిమా పరిశ్రమలో హీరోలు గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు, కానీ సినీ పరిశ్రమకే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఏకైక హీరో ప్రభాస్. 'బాహుబలి' తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్  బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు మాత్రమే సాధ్యమైన రికార్డుల గురించి తెలుసుకుందాం..

Bahubali

Bahubali Action Sence #viralvideo #bahubali

Posted by Rajasthani Comedian on Sunday, October 13, 2024

అన్నీట్లో ప్రభాసే ముందు..

టాలీవుడ్ లో ఏ రికార్డు గురించి మాట్లాడినా అది బాహుబలి నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి. మాములుగా స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే కానీ రికార్డులు సాధ్యం కావు, కానీ ప్రభాస్ విషయంలో అలా కాదు, రెబల్ స్టార్ కు హిట్టు, ప్లాపులతో సంబంధం లేదు. 

ఆయన డిజాస్టర్ సినిమా కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర  డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్.. ఇలా అన్నీట్లో ప్రభాస్ పేరే ముందుంటుంది.

Also Read : నిఘా పెట్టాల్సింది, తప్పు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్

ప్లాపులతోనే భారీ వసూళ్లు..

మిగతా హీరోలకు ఒకటి, రెండు ప్లాపులు వస్తే వాళ్ళ క్రేజ్ తో పాటూ మార్కెట్ ఒక్కసారిగా పడిపోతూ ఉంటుంది. కానీ ప్రభాస్ కు ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఆయన క్రేజ్, మార్కెట్ ఇంచు కూడా తగ్గదు. దానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలే ఉదాహారణ. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్  సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. కానీ కలెక్షన్స్ మాత్రం అదరగొట్టాయి.

Adipurush - Prabhas

నార్త్ లోనూ ప్రభాసే తోపు..

'సాహూ' మూవీ హిందీలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక తెలుగు హీరో సినిమా అది కూడా ప్లాప్ సినిమా హిందీలో వంద కోట్లు కలెక్ట్ చేయడం రికార్డ్. నార్త్ లో రూ.100కోట్ల క్లబ్ చేరిన ఫస్ట్ టాలీవుడ్ హీరో కూడా ప్రభాసే. ఇక రెబల్ స్టార్ శ్రీరాముడి పాత్రలో వచ్చిన 'ఆదిపురుష్' డిజాస్టర్ టాక్ అందుకుంది. 

కానీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తర్వాత వచ్చిన 'సలార్' రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది వచ్చిన 'కల్కి2898AD' ఏకంగా రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ కు మరో పాన్ ఇండియా హిట్ అందించింది.

Also Read : రికార్డు స్థాయిలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే

అక్కడ షారుఖ్ ఇక్కడ ప్రభాస్ 

భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక హీరో రెండు సార్లు వెయ్యి కోట్ల సినిమాల్ని డెలివర్ చేయడం అంటే మాములు విషయం కాదు. అది కేవలం ఇద్దరు హీరోలకు మాత్రమే సాధ్యమైంది. ఒకరు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయితే మరొకరు మన రెబల్ స్టార్ ప్రభాస్. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టూ బ్యాక్ వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. ఇటు టాలీవుడ్ లో బాహుబలి2, కల్కి సినిమాలతో ఆ ఘనత సాధించాడు. రానున్న రోజుల్లో ప్రభాస్ పేరిట మరికొన్ని రికార్డులు నమోదు కావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. 

#prabhas #darling-prabhas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe