/rtv/media/media_files/2025/11/16/ramayana-vs-varanasi-2025-11-16-14-46-54.jpg)
Ramayana VS Varanasi
Ramayana VS Varanasi: పౌరాణిక కథలపై వచ్చే సినిమాలు ఎప్పుడైనా ప్రేక్షకులను వెంటనే ఆకర్షిస్తాయి. అలాంటి కథలతో బాలీవుడ్‌లో నిర్మాణం జరుగుతున్న చిత్రం రామాయణ. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా కనిపించనున్నారు.
Ramayana Glimpse
అయితే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో కలసి పౌరాణిక అంశాలతో కూడిన భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా పేరు వారణాసి. నితేష్ తీస్తున్న రామాయణ పూర్తిగా వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తే, రాజమౌళి సినిమా మాత్రం రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని, అదికూడా కొత్త అంశాలతో కలిపి చూపించనున్నారు. ఈ చిత్రం 2027 సమ్మర్లో విడుదల కావొచ్చు.
Varanasi Title Teaser
రామాయణ, వారణాసి రెండు భారీ సినిమాలు కావడంతో, వాటి మధ్య పోలికలు తప్పకుండా వస్తాయి. రామాయణ కూడా పెద్ద బడ్జెట్‌తో తయారవుతుండడంతో, వరాణాసిలోని విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం రాజమౌళికి ఒక పెద్ద ఛాలెంజ్‌గానే మారవచ్చు.
అయినా, రాజమౌళి సినిమాలపై ప్రేక్షకుల్లో నమ్మకం ఎప్పటికీ ఉంటుంది. కానీ వారణాసి అనేక కాలాలను కలిపి చూపించడం వల్ల కథా నిర్మాణంలో కాస్త జాగ్రత్త అవసరం అవుతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా రామాయణంలోని ఒక కీలక భాగం ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని రాజమౌళి చెప్పడం విశేషం. ఇందులో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలో త్రేతాయుగం, కలియుగం కలిసేలా టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ కూడా ఉండబోతుంది.
ఇటీవల జరిగిన టైటిల్ ఈవెంట్‌లో రాజమౌళి, మూవీ షూట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. మహేష్ బాబు శ్రీరాముడి వేషంలో కనిపించినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని, మహేష్‌లో కృష్ణుడి ఆకర్షణ, రాముడి శాంత స్వభావం రెండూ ఉన్నాయని ఆయన అన్నారు. ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని 60 రోజులపాటు షూట్ చేసినట్టు, ప్రతి రోజు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని కూడా చెప్పారు. ఈ ఈవెంట్ సమయంలో వారణాసి టీజర్ లీక్ పై రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్టింగ్ సమయంలో డ్రోన్‌తో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంపై అసహనం వ్యక్తం చేసారు.
మొత్తం మీద, రామాయణం vs వారణాసి పోటీ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు చిత్రాలు విడుదలయ్యే సమయానికి రెండు సినిమా మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
Follow Us