/rtv/media/media_files/2025/11/19/prithviraj-sukumaran-2025-11-19-07-39-16.jpg)
Prithviraj Sukumaran
Varanasi Update: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(Rajamouli) తీస్తున్న భారీ ప్రాజెక్ట్ “వారణాసి”(Varanasi Movie) ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి చూపించిన విజువల్స్, గ్రాండియర్, కొత్త ప్రపంచాన్ని చూపించిన తీరు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఈసారి మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా కనిపించనుండగా, ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) విలన్ గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన థీమ్ సాంగ్ కూడా బయటకు వచ్చింది. గ్లింప్స్ ఈవెంట్ సమయంలో ఎం.ఎం.కీరవాణి ఈ ట్రాక్‌ని పరిచయం చేశారు. ఈ థీమ్ పై అభిమానుల్లో పెద్ద ఆసక్తి ఏర్పడింది. దీనిని అధికారికంగా విడుదల చేయాలని చాలా మంది కోరడంతో, చిత్రబృందం వెంటనే స్పందించి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రాక్‌ను అందుబాటులో పెట్టింది. ఈ విలన్ థీమ్‌కు “రాణా కుంభ” అనే పేరు పెట్టారు. ఈ మ్యూజిక్ బిట్ కి కీరవాణి, ఆదిత్య అయ్యంగార్, చైతన్య ప్రసాద్ కలిసి పనిచేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే అభిమానులు ఈ ట్రాక్‌ను ఫుల్ వైరల్ చేస్తున్నారు.
ఇక చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో క్లైమాక్స్ షూట్‌ను జరుపుకుంటోంది. షూటింగ్‌తో పాటు ఇంటర్వ్యూలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రాజమౌళి సాధారణంగా తన సినిమాల వివరాలను చివరి వరకు బయటకు చెప్పరు. కానీ ఈసారి షూటింగ్ పూర్తయ్యేలోపే గ్లింప్స్ విడుదల చేయడం, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఆయన ఈ చిత్రంపై ఎంత నమ్మకంగా ఉన్నారో చెబుతోంది.
ఇప్పటికే విడుదలైన విజువల్స్‌లో రాజమౌళి రూపొందించిన కొత్త ప్రపంచం, భారీ సెట్స్, అద్భుతమైన VFX పనితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రేక్షకుల నుంచీ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా మీద ఏర్పడిన భారీ అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
ఈ భారీ చిత్రం సమ్మర్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది. కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో “వారణాసి” 2027లో భారీ హిట్‌గా నిలుస్తుందని ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. విలన్ థీమ్ ‘రాణా కుంభ’ విడుదలతో సినిమా హైప్ మరింత పెరిగింది. అభిమానులు ఇప్పుడు గ్లింప్స్ తర్వాత ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow Us