Kothapallilo Okappudu: 'కొత్తపల్లిలో' ఏం జరిగింది..? రానా దగ్గుబాటి కొత్త సినిమా ట్రైలర్

రానా దగ్గుపాటి నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం  'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్  విడుదలైంది. పల్లెటూరి నేపథ్యంలో సాగిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకంటోంది. పచ్చటి పొలాలు, మట్టి రోడ్లు, బాల్యం ప్రేమలు పల్లెటూరి జీవితాన్ని గుర్తుచేస్తున్నాయి.

New Update

Kothapallilo Okappudu: రానా దగ్గుపాటి నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం  'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్ విడుదలైంది. 'కొత్తపల్లి' అనే గ్రామం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాను రూపొందించారు.  పల్లెటూరి నేపథ్యంలో సాగిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకంటోంది. పచ్చటి పొలాలు, మట్టి రోడ్లు, బాల్యం ప్రేమలు పల్లెటూరి జీవితాన్ని గుర్తుచేస్తున్నాయి. హీరో హీరోయిన్ల అమాయకమైన ప్రేమ, సంభాషణలు ఆకట్టుకున్నాయి.  అప్పటివరకు సరదాగా సాగిన  ఈ ఊరి కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఊళ్ళో  ఏదో అలజడి మొదలవుతుంది! ఆ మిస్టరీ ఏంటి అనేదే  'కొత్తపల్లిలో ఒకప్పుడు'  కథ. మొత్తానికి ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించింది. 

Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

జులై 18న విడుదల

'కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన  ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మనోజ్, మౌనిక  హీరోహీరోయిన్లుగా నటించారు. అవింద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జులై 18న థియేటర్స్ లో విడుదల కానుంది. రూటీన్  కథలకు భిన్నంగా మలచిన ఈ గ్రామీణ డ్రామా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం ఉందని  తెలుస్తోంది. 

Also Read: Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు